రంగా రెడ్డి : మంచాల మండలం ఎల్లమ్మతండాలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అఖిల ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆరు నెలలుగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు, అఖిలతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ వ్యవహారం ఇరుపక్షాల తల్లిదండ్రులకు నాలుగు రోజుల క్రితం తెలిసింది. పెళ్లి చేసేందుకు రూ.6 లక్షల కట్నకానుకలు ఇవ్వాలని అబ్బాయి తరపు తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు.
అంతా మాట్లాడుకున్న తర్వాత శ్రీకాంత్, అఖిలకు ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇస్తే గానీ మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకునేలా లేరని, ఇద్దరం పురుగుల మందు తాగి చనిపోదామని ఫోన్ చేసి చెప్పాడు. ఇద్దరూ చనిపోదామని నిర్ణయించుకుని ఇంట్లో పురుగుల మందు తాగారు. ఇద్దరినీ ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment