కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. రామగుండం నుంచి బయల్దేరి మేడారం వద్ద 6వ ప్యాకేజీ పంప్ హౌస్ పనులను పరిశీలిస్తారు. అలాగే రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద 8వ ప్యాకేజీ పంప్‌హౌస్ పనులను, రాంపూర్ వద్ద రివర్స్ పంపింగ్ పనులను ఆయన పరిశీలించనున్నారు. రామడుగులో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రగతిపై అధికారులతో సమీక్షిస్తారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులపై ఏరియల్ సర్వే చేసిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment