
చిన్న పిల్లలు, వారి ముద్దుముద్దు మాటలు.. చిలిపి చేష్టలని ఇష్టపడని వారు బహుశా ఉండరేమో. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే.. వారి బోసి నవ్వులు చూస్తే.. మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెన్షన్.. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యి.. అందరిలో ఒకలాంటి నిర్లిప్తత. ఇలాంటి సమయంలో మనందరి పెదాల మీద నవ్వులు పూయించే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.(‘ఎవరైనా తరుముతున్నారా ఏంటి..?’)
సింగర్, పాటల రచయిత నికోలా మరియా రాబర్ట్స్ ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిలో ఇద్దరు చిన్న పిల్లలు ఆరెంజ్ జ్యూస్‌ను తాగుతుంటారు. అయితే ఇలా తాగుతున్నంత సేపు ఆ పిల్లలు నవ్వుతూనే ఉంటారు. వారు ఎందుకు నవ్వుతున్నారో కారణం తెలియదు కానీ.. ఎలాంటి కల్మషం లేని ఆ చిన్నారుల నవ్వు చూస్తూంటే తెలియకుండానే మన పెదాల మీద కూడా నవ్వు విచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 1.8 మిలయన్ల మంది వీక్షించారు.. మీరు ఓ సారి చూసి హాయిగా నవ్వేయండి.
(మన దగ్గర కూడా ఇలానే అవుతుందేమో..!)
Comments
Please login to add a commentAdd a comment