ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టగలరా | Can You Spot The Leopard In This Viral Pic | Sakshi
Sakshi News home page

వైరలవుతున్న ఫోటో.. ఆసక్తి కనబరుస్తోన్న నెటిజన్లు

Published Mon, Sep 30 2019 6:21 PM | Last Updated on Mon, Sep 30 2019 6:30 PM

Can You Spot The Leopard In This Viral Pic - Sakshi

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ‘దీనిలో చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టగలరా’ అంటూ నెటిజన్లకు సవాలు విసురుతోంది. చుట్టు మట్టి దిబ్బలే కనిపిస్తున్న ఈ ఫోటోలో చిరుతను కనుక్కోవడం అంత సులభం కాదు. కానీ ప్రయత్నిస్తే.. గుర్తు పట్టవచ్చు. బెల్లా లాక్‌ అనే ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘కొందరు ఈ ఫోటోను నాకు పంపించారు. దీనిలో చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టమన్నారు. ఫస్ట్‌ నేను ఇది జోక్‌ అనుకున్నాను. కానీ చివరకు కనిపెట్టేశాను. మీరు గుర్తించారా’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటికే వేల మంది ప్రయత్నించారు. కొందరు చిరుతను కపిపెట్టగా.. మరి కొందరు చిరుత లేదు.. ఏం లేదు అని కొట్టి పారేస్తున్నారు. మీరు ఓ సారి ప్రయత్నించండి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement