జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల యావత్ భారతం హర్షం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారి ప్రతిభను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన ఆసక్తికర ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
‘కొన్ని దేశాలు తమ జాతీయ జెండాలపై చంద్రున్ని ఉంచుకున్నాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం ఆ చంద్రునిపైనే తమ జెండాలను పాతాయి’ అని చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ భజ్జీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ఆయా దేశాల జెండాలను సైతం జతచేశాడు. అయితే ఈ ట్వీట్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరూ భజ్జీ ఆసక్తికర ట్వీట్‌ను సమర్ధిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తూ.. ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ‘ నీ ట్వీట్ పట్ల సిగ్గు పడుతున్నాం.. ఎంత చెత్తగా ఆలోచించావో నీ ట్వీట్ తెలియజేస్తుంది. అలాగే భారతీయులంతా చెడ్డవాల్లనేటట్లు ఉంది’ అని ఒకరంటే.. ‘హర్భజన్.. హిందూత్వ ఆలోచనలతో ముస్లిం దేశాలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నాడు. కానీ హిందూత్వ దేశమైన నేపాల్ జాతీయ జెండాలో కూడా చంద్రుడు ఉన్నాడనే విషయం తెలుసుకోవాలి’ అంటు మరోకరు కామెంట్ చేస్తున్నారు. చంద్రునిపైకి వెళ్తే అభివృద్ధి సాధించినట్లు కాదని ఇంకోకరు చురకలంటిస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. (చదవండి: నిప్పులు చిమ్ముతూ...)
Singapore, Laos, Mongolia, Nepal
— Faizan Shaikh (@Faizan902894) July 23, 2019
also have the moon on their country flags. Nepal was Hindu majority till a few years ago. Sad to see Harbhajanamplifying Hindutva trope and picking on the Muslim nations. Not cool. https://t.co/Ap5AwQnahQ
Comments
Please login to add a commentAdd a comment