న్యూఢిల్లీ : ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సాప్‌లో సమాచారం షేర్ చేయొద్దని చెప్పారు. అపరిచిత గ్రూప్‌లలో మెంబర్లుగా ఉంటే.. పాకిస్తాన్ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు వాట్సాప్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలని ఆర్మీ అధికారులు సైనికులకు సూచించారు. తద్వారా అనుమానిత గ్రూప్‌లలో ఆటోమేటిక్‌గా మెంబర్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. అయితే, ప్రమాదంలో ఉన్న సైనికుల్ని అప్రమత్తం చేయడానికి వాట్సాప్ గ్రూపులు పనిచేస్తాయని కొందరు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment