వీడెవడ్రా బాబూ..! | Man Shoots Birthday Cake Video Viral | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 15 2019 3:17 PM | Last Updated on Tue, Jan 15 2019 3:21 PM

Man Shoots Birthday Cake Video Viral - Sakshi

లక్నో : బర్త్‌డే కేక్‌ను కత్తితో కట్‌చేసి సెలబ్రేట్‌ చేసుకుంటాం.. కానీ అందరిలా చేస్తే స్పెషల్‌ ఏముంటింది? అనుకున్నారో ఏమో కానీ ఓ నలుగురు కుర్రాళ్లు.. తమ స్నేహితుడి బర్త్‌డే కేక్‌ను వైవిధ్యంగా గన్‌తో షూట్‌చేయించి సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీన్ని ఓ ఔత్సాహికుడు ట్వీట్‌ చేయగా ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌, మీరట్‌లో జరిగినట్లు చెబుతున్నప్పటికి.. ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది మాత్రం స్పష్టం లేదు. మరోవైపు ఈ తరహా సెలెబ్రేషన్‌ మీరట్‌లో జరిగిందన్న వార్తలను ఆ నగర పోలీసులు ఖండిస్తున్నారు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే.. అర్ధరాత్రి నడిరోడ్డుపై నలుగురు కుర్రాళ్లు వారి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకులను జరిపారు. గుజ్జార్‌ అనే పేరు రాసిన కేకును గన్‌తో షూట్‌ చేయించారు. కేకు కట్టింగ్‌ కోసం ఆ యువకుడు గన్‌తో పలుమార్లు ప్రయత్నించడం అందరిని ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. వీడెవడ్రా బాబూ..గన్‌తో కేకును షూట్‌ చేశాడు! అంటూ సెటైర్లు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement