Meerut police
-
'పాకిస్తాన్ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్'
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద కామెంట్లను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఖండించారు. సంబంధిత పోలీసు అధికారి గనుక వీడియోలో కనిపించినట్లు నిజంగానే ముస్లింలను పాకిస్తాన్ వెళ్లిపోవాలన్న అనుచిత వ్యాఖ్యలు చేసుంటే కచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద దేశ వ్యాప్తంగా ఎత్తున ఉద్యమాలు జుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోనైతే వేరే చెప్పనక్కర్లేదు. ఈ నిరసనలు హింసాత్మకమవుతూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ కాగా.. మీరట్ ఎస్పీ గో బ్యాక్ టు పాకిస్తాన్ వీడియో వైరల్ కావడం, దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మైనార్టీల మంత్రిగా నఖ్వీ స్పందించారు. అల్లరిమూకలు కావొచ్చు లేదా పోలీసులే కావచ్చు.. తప్పుచేసిన వాళ్లెవరినీ వదిలిపెట్టొద్దు. మీరట్ ఎస్పీ కామెంట్లు ముమ్మాటికీ వివాదాస్పదమైనవే. సాక్ష్యాధారాలు పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలి'' అని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలో, పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మీరట్‌లోని లిసారీ గేటు దగ్గర సీఏఏ నిరసనలు చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే పాకిస్తాన్ వెళ్లిపోండి ఇక్కడి తిండి తింటూ, పక్కదేశాన్ని పొగడటానికి సిగ్గులేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. Check this out SP city Meerut UP sending people to Pakistan trying to understand he is really a public servant @ReallySwara @RanaAyyub @anuragkashyap72 @anubhavsinha @navinjournalist @umashankarsingh #CAA_NRCProtests #CAAAgainstConstitution @farah17khan pic.twitter.com/QWvGIcf5n6 — jugnu khan (@thejugnukhan) December 26, 2019 -
వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ
-
వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ
లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఓ పోలీస్ ఉన్నతాధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం మీరట్‌లో ప్రార్థనల అనంతరం ఓ వర్గం వారు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టిన తర్వాత జిల్లా ఎస్పీ అఖిలేశ్ నారాయణ సింగ్ ముస్లింలు అధికంగా ఉన్న వీధుల్లో నడుస్తూ భద్రతను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఓ వీధిలో ముగ్గురు ముస్లింలు ఎదురవగా, ఎస్పీ వారితో మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. వారు నమాజ్ చేయడానికని సమాధానమిచ్చారు. తిరిగి ఎస్పీ అది మంచిదే. కానీ, నల్లరంగు, నీలి రంగు బ్యాడ్జిలు ధరించిన వాళ్లకు చెప్పండి. ఇక్కడ ఉండడానికి ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్లిపొమ్మని. ఇక్కడ ఉంటూ, ఇక్కడి తిండి తింటూ వేరే వాళ్లను పొగడుతారా? అని మండిపడ్డారు. దీనికి మీరు చెప్పింది కరెక్టు సార్ అని ముగ్గురిలో ఒకరు బదులిచ్చారు. తర్వాత ఎస్పీ వెళ్తూ వెనక్కి తిరిగి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తానంటూ హెచ్చరించారు. ఈ సన్నివేశమంతా వీడియోలో రికార్డయింది. ఈ విషయంపై ఓ జాతీయ మీడియా ఎస్పీని సంప్రదించగా.. ‘సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్బంగా కొంతమంది యువకులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. వాళ్లను చూద్దామని మేం అక్కడికి వెళ్లాం. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలవి’ అని వివరణనిచ్చారు. కాగా, యూపీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మీరట్లోనే ఎక్కువ మంది చనిపోయారు. చదవండి : గ్రేట్ సీఎం.. వారిపై యోగి కార్యాలయం ట్వీట్ -
వీడెవడ్రా బాబూ..!
లక్నో : బర్త్‌డే కేక్‌ను కత్తితో కట్‌చేసి సెలబ్రేట్ చేసుకుంటాం.. కానీ అందరిలా చేస్తే స్పెషల్ ఏముంటింది? అనుకున్నారో ఏమో కానీ ఓ నలుగురు కుర్రాళ్లు.. తమ స్నేహితుడి బర్త్‌డే కేక్‌ను వైవిధ్యంగా గన్‌తో షూట్చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్ యాప్‌లో అప్లోడ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీన్ని ఓ ఔత్సాహికుడు ట్వీట్ చేయగా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్, మీరట్‌లో జరిగినట్లు చెబుతున్నప్పటికి.. ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది మాత్రం స్పష్టం లేదు. మరోవైపు ఈ తరహా సెలెబ్రేషన్ మీరట్‌లో జరిగిందన్న వార్తలను ఆ నగర పోలీసులు ఖండిస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. అర్ధరాత్రి నడిరోడ్డుపై నలుగురు కుర్రాళ్లు వారి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకులను జరిపారు. గుజ్జార్ అనే పేరు రాసిన కేకును గన్‌తో షూట్ చేయించారు. కేకు కట్టింగ్ కోసం ఆ యువకుడు గన్‌తో పలుమార్లు ప్రయత్నించడం అందరిని ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వీడెవడ్రా బాబూ..గన్‌తో కేకును షూట్ చేశాడు! అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
ఆసిఫ్అలీ కోసం మీరట్‌కు...
పీటీ వారెంట్‌పై తీసుకువచ్చేందుకు వెళ్లిన సీసీఎస్ పోలీసులు హైదరాబాద్: దేశద్రోహానికి పాల్పడిన మిలటరీ అధికారి పటన్‌కుమార్ ఉదంతంలో మూడు రోజుల క్రితం ఆసిఫ్‌అలీని మీరట్ పోలీసులు అరెస్టు చేశారు. అనుష్కా అగర్వాల్ ఆదేశాల మేరకు పటన్ బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు పంపింది ఆసిఫ్‌గా గుర్తించారు. బ్యాంకు సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా మీరట్ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. అతన్ని నగరానికి తెచ్చేందుకు పీటీ వారెంట్ కోసం సీసీఎస్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. మీరట్ జైలులో ఉన్న ఆసిఫ్‌ని నగరానికి తీసుకువస్తారు.అతన్ని పోలీసు కస్టడీలో విచారిస్తారు.ఈ కేసులో అనుష్క కోసం ఆరా తీస్తున్నారు.వచ్చే జీతం సరిపోక 15 ఏళ్లలో మనీసర్కులేషన్ స్కీమ్ ద్వారా కోటీశ్వరుడిని కావాలకున్నానని పటన్ వెల్లడించినట్లు తెలిసింది. అందుకు గత ఏడాది ‘ఎమ్ఎల్ఎమ్ సెక్యూర్డ్ లైఫ్’ స్కీమ్‌ను ప్రారంభించానని, ఈ స్కీమ్‌లో మిలటరీ అధికారులు, సుబేదార్లను సభ్యులుగా చేర్పించినట్లు చెప్పాడు.