
సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ జీ.. వాట్ ఏ షాట్.. మీ షాట్ పక్కా సిక్స్.. బంతి కూడా దొరక్కుండా పోయింది. వాట్ ఈజ్ దిస్.. రాహుల్ కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు కదా.! ఈ షాట్ కొట్టడం ఏమిటి అనుకుంటున్నారా..? ఇవన్నీ రాహుల్‌కు సంబంధించిన ఓ ఫొటోకు వస్తున్న కామెంట్లు.. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీపై నోరు జారీ సస్పెండ్ అయిన మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ విషయంలో రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఆయన అభిమానులు. అలహాబాద్‌కు చెందిన హసీబ్ అహ్మద్ అనే యువనేత అయితే ఏకంగా ధోని ఫొటోను రాహుల్‌గా, బంతిని అయ్యర్‌గా మార్ఫింగ్ చేసి... బంతిని లాగి కొట్టే ఓ పోస్టర్‌ను రూపోందించి ‘వెల్‌డన్ రాహుల్ బాయ్’ అని సోషల్ మీడియాలోకి వదిలాడు. ఇంకేముంది.. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఢిల్లీలో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ.. రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలను చెరిపేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. దీనిపై మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ.. ‘మోదీ నీచమైన జాతికి చెందిన వ్యక్తి, ఆయనకు సభ్యత లేదు’ అని తీవ్రంగా విమర్శించారు. మోదీపై చేసిన ఈ పరుష వ్యాఖ్యలు దుమారం రేగటంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయ్యర్ క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది. షోకాజ్ నోటీసులూ జారీచేసింది. అయ్యర్ వ్యాఖ్యలను సమర్థించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఇలాంటి పదజాలాన్ని వినియోగించకూడదని కూడా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment