తమిళసినిమా: అదే నా పాలసీ అంటున్నారు నటి సమంత. వివాహానంతరం కథానాయకిగా కొనసాగడం అన్నది అరుదైన విషయమే అవుతోంది. అలాంటి నటి సమంత. పెళ్లికి ముందు చాలా మంది చాలా చెబుతుంటారు. ఆ తరువాత వాటిని ఆచరించడంలో ఫెయిల్ అవుతుంటారు. నటి సమంత తను కోరుకున్నట్లుగానే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా తాను నటిస్తానని చెప్పారు. అన్నట్టుగానే పెళ్లి అయిన మూడవ రోజు నుంచే షూటింగులలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న క్రేజీ నటి సమంత. ముఖ్యంగా తమిళంలో తను విశాల్‌తో నటించిన ఇరుంబుతిరై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. శివకార్తికేయన్‌తో నటిస్తున్న చిత్రం షూటింగ్‌లో ఇటీవలే పాల్గొన్నారు.
సమంత లాంటి సెలబ్రిటీలు చేసే పనులు కానీ, చెప్పే మాటలు గానీ సాధారణ ప్రజలపై, ముఖ్యంగా అభిమానులపై చాలా ప్రభావం చూపుతాయి. అందుకే సమంత చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఈ బ్యూటీ ఒక స్లోగన్ చెబుతూ శ్రమను నమ్ముకోండి. అదృష్టాన్ని నమ్మి దాని కోసం పరుగులు తీయొద్దు. ఇదే నా పాలసీ అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి స్లోగన్‌ను ఇంతకు ముందు కొన్ని పోస్టర్లలోనో, టీ షర్టులపైనో చూసి ఉండవచ్చు. అయితే సమంత లాంటి ఒక సెలబ్రిటీ చెప్పే ఇలాంటి వ్యాఖల ప్రభావం వాటి కంటే ఎక్కువగా జనాలపై పడుతుందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ పాలసీ ఇప్పుడు సోషల్ మీడియా మరింత ప్రచారం చేస్తోంది. సమంత కీలక పాత్రలో కీర్తీసురేశ్ మహానటి సావిత్రిగా నటిస్తున్న నడిగైయార్ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ ద్విభాషా చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment