
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఢిల్లీ డాషర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ చివరి లీగ్ పోరులో ఢిల్లీ 4–1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌ను ఓడించింది. తాజా ఫలితంతో స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, శ్రీకాంత్, కశ్యప్‌లతో కూడిన అవ«ద్ వారియర్స్ జట్టు లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటికే హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, అహ్మదాబాద్ రాకెట్స్ సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడతారనేది గురువారం హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో తేలుతుంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి పోరు దాదాపు ఏకపక్షంగా సాగింది.
ముందుగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ జంట మిషెల్ లీ–షిన్ బాక్ చెల్ 15–13, 15–11తో అశ్విని పొన్నప్ప–వ్లదీమర్ ఇవనోవ్ (ఢిల్లీ)ను ఓడించింది. తొలి పురుషుల సింగిల్స్‌లో నార్త్ ఈస్టర్న్ ప్రధాన ఆటగాడు అజయ్ జయరామ్ 13–15, 15–10, 12–15తో ఢిల్లీ ప్లేయర్ వింగ్ కీ వాంగ్ విన్సెంట్ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. రెండో పురుషుల సింగిల్స్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న వారియర్స్ భంగపడింది. వారియర్స్ ఆటగాడు జు వీ వాంగ్ 10–15, 15–8, 11–15 తేడాతో తియాన్ హువీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ ఫలితంతో నార్త్ ఈస్టర్న్ పాయింట్ కోల్పోగా... డాషర్స్ 2–0తో ముందంజలో నిలిచింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్ మ్యాచ్‌ను ఢిల్లీ ట్రంప్‌గా ఎంచుకుంది. ఇందులో సత్తా చాటిన సుంగ్ జీ హున్ 13–15, 15–11, 15–13తో మిచెల్లి లీని ఓడించి తమ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేర్చింది. దాంతో డాషర్స్ ఆధిక్యం 4–0కు పెరిగి జట్టు సెమీస్ చేరడం ఖాయమైపోయింది. ప్రాధాన్యత లేని చివరి పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో వారియర్స్ తరఫున కిమ్ జి జంగ్–షిన్ బేక్ చెల్... ఢిల్లీ తరఫున ఇవనోవ్–సొజొనొవ్ తలపడ్డారు. ఇందులో వారియర్స్ జోడీ 9–15, 15–10, 15–9తో
Comments
Please login to add a commentAdd a comment