
కార్డిఫ్: తొలి టీ20లో అదరగొట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. రెండో టీ20లో చతికిలపడ్డారు. ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు భారత బ్యాట్స్‌మెన్ తేలిపోవడంతో స్వల్పస్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కార్డిఫ్ పిచ్ నెమ్మదైనది కావడంతో పరుగులు చేయడానికి టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన పేస్ బౌలింగ్‌తో భారత ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు.
జాక్ బాల్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ(5) క్యాచ్ ఔట్ కాగా, నిర్లక్ష్యంతో మరో ఓపెనర్ శిఖర్ ధావన్(10) రనౌట్‌గా వెనుదిరిగారు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన తొలి మ్యాచ్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్(6) విఫలమవ్వటంతో భారత్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లి(47; 38 బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు), సురేశ్ రైనా(27; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో ఎంఎస్ ధోని (32; 24 బంతుల్లో 5 ఫోర్లు), పాండ్యా(12) బ్యాట్ ఝళిపించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, బాల్, ప్లంకెట్, రషీద్ తలో వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment