1000 వికెట్లతో అరుదైన ఫీట్..
కొలంబో: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాతో అరుదైన ఫీట్ను సొంతం చేసుకున్నాడు. తన ఫస్టక్లాస్ కెరీర్లో వెయ్యి వికెట్లు సాధించిన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లను తీసిన తరువాత వెయ్యి ఫస్ట్ క్లాస్ వికెట్ల క్లబ్ లో చేరాడు. తద్వారా శ్రీలంక తరపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా హెరాత్ నిలిచాడు. కాగా, వెయ్యి అంతకంటే ఫస్ట్ క్లాస్ వికెట్లను సాధించిన 12వ ఉప ఖండపు ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఇదిలా ఉంచితే, 214/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 467 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్(52)హాఫ్ సెంచరీ సాధించగా, మరో ఓవర్ నైట్ ఆటగాడు షకిబుల్ హసన్(116) సెంచరీ సాధించాడు. వీరికి జతగా మొసదేక్ హుస్సేన్(75) రాణించడంతో బంగ్లాదేశ్ నాలుగు వందల మార్కును దాటింది. దాంతో బంగ్లాదేశ్ కు 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.