
నాగ్‌పూర్:టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది 50వ టెస్టు వికెట్‌ను తన ఖాతాలో వేసుకుని మరో మైలురాయిని చేరుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో పెరీరా వికెట్ ను తీసిన అనంతరం అశ్విన్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తద్వారా ఈ క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు వరుసలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ఉన్నాడు. లంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు సాధించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment