స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలు
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ క్రీడల్లో పతకాలు సాధించే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు భారీగా నగదు బహుమతులు ఇస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేరళలో 31 నుంచి జరిగే క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధిస్తే రూ.7 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్యానికి రూ.3 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని మంత్రి తెలిపారు. టీమ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన జట్లకు కూడా మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా నగదు ప్రోత్సాహకం ఇస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఏపీ తరఫున క్రీడల్లో పాల్గొం టున్న క్రీడాకారులకు దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఆయన కిట్‌లు అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరైన మౌళిక సదుపాయాలు లేకపోయినా... పతకాలు తెస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏపీ ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీ చైర్మన్ పవన్‌రెడ్డి, జాతీయ క్రీడల చెఫ్ డి మిషన్ తోట నరసింహం, రమణరావు, కేపీరావు, శాప్ వీసీ అండ్ ఎండీ చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.