ఇండోర్: గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా అలవోకగా బంతిని గాల్లోంచి బౌండరీ దాటిస్తున్నాడు. అయితే ఇదేమీ తనకు కొత్త కాదని, సిక్సర్లు కొట్టే సామర్థ్యం తనకు చిన్నప్పటినుంచి ఉందని పాండ్యా చెప్పాడు. పాకిస్తాన్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత తనలోని ఈ సత్తా బయటపడిందనే విషయాన్ని తాను అంగీకరించనని అతను అన్నాడు. ‘పాక్‌తో మ్యాచ్ తర్వాతే నా ఆట మారిందని ఎవరైనా భావిస్తే దానికి నేను అభ్యంతర పెట్టను. అంతకంటే ముందు ఐపీఎల్‌లో కూడా నేను చాలా బాగా ఆడాను.
ఈ ఏడాది ఐపీఎల్‌లో విఫలం కావడంతో తీవ్రంగా శ్రమించి ఫామ్‌లోకి వచ్చాను. గతంలో కూడా నేను భారీ సిక్సర్లు కొట్టేవాడిని. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఆడుతుండటం తప్ప అందులో తేడా ఏమీ లేదు. సరిగ్గా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి కూడా భారీ సిక్సర్లు బాదే అలవాటు నాకుంది’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగడాన్ని సవాల్‌గా తీసుకోవడంకంటే దానిని ఒక మంచి అవకాశంగా భావించానన్న హార్దిక్... కెరీర్‌లో తొలిసారి ఎక్కువ బంతులు (72) ఆడే అవకాశం రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
చిన్నప్పటి నుంచి నేనింతే!
Published Tue, Sep 26 2017 12:11 AM | Last Updated on Tue, Sep 26 2017 2:16 AM
Advertisement