18 బంతుల్లో హాఫ్ సెంచరీ
డంబుల్లా: శ్రీలంకతో నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో రికార్డు హాఫ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మన్గా రికార్డును సమం చేశాడు. గతంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున మ్యాక్స్వెల్, సిమోన్ ఓడానెల్ పేరిట ఈ రికార్డు ఉంది. కాగా ఓవరాల్గా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ ఖాతాలో ఉంది. గతేడాది వెస్టిండీస్తో జొహాన్నెస్బర్గ్లో జరిగిన వన్డేలో డివిల్లీర్స్ 16 బంతుల్లో అర్ధశతకం బాదాడు.
డంబుల్లా వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన లంక పూర్తి ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (76) హాఫ్ సెంచరీ, మాథ్యూస్ 40 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్ హేస్టింగ్స్ 6 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేధనలో ఫించ్ రికార్డు హాఫ్ సెంచరీ చేశాడు. కాగా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మరుసటి బంతికే ఫించ్ అవుటయ్యాడు.