భారత్‌తో టెస్టు: అఫ్గాన్‌ చెత్త రికార్డు | Afghanistan batted the fewest overs in an innings of their inaugural Test | Sakshi
Sakshi News home page

భారత్‌తో టెస్టు: అఫ్గాన్‌ చెత్త రికార్డు

Published Fri, Jun 15 2018 3:38 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Afghanistan batted the fewest overs in an innings of their inaugural Test - Sakshi

బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన అఫ్గానిస్తాన్‌ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అరంగేట్రపు టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప ఓవర్లు ఆడిన అపప్రథను సొంతం చేసుకుంది. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన ఓవర్లు 27.5. ఫలితంగా అరంగేట్రం మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌ను తక్కువ ఓవర్లతో ముగించిన జట్టులో జాబితాలో అఫ్గాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఈ క‍్రమంలోనే ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డును అఫ్తాన్‌ సవరించింది. గతంలో బంగ్లాదేశ్‌ తన అరంగేట్రం మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో 46.3 ఓవర్లు ఆడగా, తాజాగా అఫ్గాన్‌ 28 ఓవర్లలోపు ఒక ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.


భారత్‌తో చారిత్రక టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అఫ్గానిస్తాన్‌ పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల విజృంభణకు ఏదశలోనూ తేరుకోని అఫ్గాన్‌ 109 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. భారత బౌలరల్లో రవిచంద‍్రన్‌ అశ్విన్‌ చెలరేగి బౌలింగ్‌ చేశాడు. ఎనిమిది ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించి అఫ్గానిస్తన్‌ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా ఇషాంత్‌ శర్మ, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లతో మెరవగా, ఉమేశ్‌ యాదవ్‌కు వికెట్‌ దక్కింది. అఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లలో మహ్మద్‌ నబీ(24)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.  షహజాద్‌(14), జావేద్‌ అహ్మదీ(1), రహ్మత్‌ షా(14), అఫ్సర్‌ జజాయ్‌(6), అస్గార్‌ స్టానిక్‌జాయ్‌(11)లు తీవ్రంగా నిరాశపరిచారు.

అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. 347/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్‌ ఆటగాడు అశ్విన్‌(7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరగా, మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క‍్రమంలోనే హార్దిక్‌ పాండ్యా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత కాసేపటికి రవీంద్ర జడేజా(20) ఔట్‌ కావడంతో 436 పరుగుల వద్ద భారత్‌ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో హార్దిక్‌(71;94 బంతుల్లో 10 ఫోర్లు) సైతం పెవిలియన్‌ చేరాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement