హడలెత్తించిన కరీమ్‌ | Afghanistan Beat West Indies In 2nd T20 | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన కరీమ్‌

Published Sun, Nov 17 2019 4:03 AM | Last Updated on Sun, Nov 17 2019 4:03 AM

Afghanistan Beat West Indies In 2nd T20 - Sakshi

లక్నో: అఫ్గానిస్తాన్‌ మీడియం పేస్‌ బౌలర్‌ కరీమ్‌ జనత్‌ (5/11) రెచ్చిపోయాడు. దీంతో రెండో టి20లో అఫ్గానిస్తాన్‌ 41 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపొంది సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత అఫ్గాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. కరీమ్‌ (26; 5 ఫోర్లు), హజ్రతుల్లా (26; 3 ఫోర్లు, సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. అనంతరం విండీస్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. కరీమ్‌ బంతులకు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆల్‌రౌండ్‌ షోతో మురిపించిన కరీమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. చివరి టి20 ఆదివారం జరుగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement