‘7 బంతుల్లో 7 సిక్సర్లు’ | Afghanistan beat Zimbabwe by 28 runs | Sakshi
Sakshi News home page

‘7 బంతుల్లో 7 సిక్సర్లు’

Published Sun, Sep 15 2019 2:52 AM | Last Updated on Sun, Sep 15 2019 11:19 AM

Afghanistan beat Zimbabwe by 28 runs - Sakshi

ఢాకా:ముక్కోణపు టి20 టోరీ్నలో అఫ్గానిస్తాన్‌ 28 పరుగులతో జింబాబ్వేను చిత్తుచేసింది. ముందుగా అఫ్గాన్‌ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (30 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మొహమ్మద్‌ నబీ (18 బంతుల్లో 38; 4 సిక్సర్లు) చెలరేగి 51 బంతుల్లో 107 పరుగులు జోడించారు. వీరిద్దరు కలిసి ఒక దశలో వరుసగా 7 బంతుల్లో 7 సిక్సర్లు బాదడం విశేషం. 17వ ఓవర్‌ చివరి 4 బంతులను నబీ సిక్సర్లు కొట్టగా...18వ ఓవర్‌ తొలి 3 బంతులను జద్రాన్‌ సిక్సర్లుగా మలిచాడు. అనంతరం జింబాబ్వే 7 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement