
ఆసీస్ బౌలర్ 150.8 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని మార్కర్‌మ్ సిక్స్ కొట్టగాజ..
అడిలైడ్ : దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో విజయానందుకున్న విషయం తెలిసిందే. వరుస ఓటములతో సతమతమైన ఆ జట్టుకు ఈ విజయం కొంత ఊరటనిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కరమ్ కొట్టిన ఓ అద్బుత సిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆసీస్ బౌలర్ 150.8 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని మార్కర్‌మ్ సిక్స్ కొట్టడం విశేషం అయితే.. ఈ బంతి గ్యాలరీలోని ఓ ప్రేక్షకుడు అందుకోవడం మరో విశేషం. ఫుల్ క్రౌడ్‌లో ఆ క్యాచ్ అందుకున్న ఆ అభిమాని చిన్నపిల్లాడిలా ఉబ్బితబ్బిబ్బవ్వడం అక్కడి ప్రేక్షకులను, కామెంటేటర్స్‌ను ఆకట్టుకుంది. మ్యాచ్ వ్యాఖ్యాతలు అయితే మార్కర్‌మ్ సిక్స్ కన్నా ఆ అభిమాని క్యాచ్‌నే ప్రస్తావిస్తూ కొనియాడడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన అధికారిక వెబ్‌సైట్ ట్విట్ చేయగా.. ఈ వీడియో వైరల్ అయింది. (చదవండి: హమ్మయ్య.. గెలిచాం)
This was a serious shot off a rapid Starc delivery, but how's the catch from Old Mate in the crowd?! #AUSvSA pic.twitter.com/nvTl9Siwde
— cricket.com.au (@cricketcomau) November 9, 2018
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 231 పరుగులు చేసింది. అరోన్ ఫించ్(41), క్రిస్ లిన్(44), అలెక్స్ కారే(47)లు రాణించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరును సఫారీల ముందుంచింది. అయితే లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి పరాజయం చెందింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డుప్లెసిస్(47), డేవిడ్ మిల్లర్(51)లు ఆకట్టుకున్నప్పటికీ గెలుపును అందించలేకపోయారు. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!)