లండన్: టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాని రహానే ప్రస్తుతం ఇంగ్లిష్ కౌంటీలో హాంప్‌షైర్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. ప్రపంచకప్ సందర్భంగా భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోజే రహానె శతకం సాధించిడం విశేషం. అంతకుముందు పీయుష్ చావ్లా, మురళీ విజయ్ కౌంటీ క్రికెట్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకాలు సాధించారు. 2013లో సోమర్‌సెట్ తరఫున ఆడిన చావ్లా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ కాగా, 2018లో ఎసెక్స్‌కు ఆడిన విజయ్ కౌంటీల్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి రెండో టీమిండియా ఆటగాడిగా నిలిచాడు.
నాటింగ్‌హాంషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులకే ఔటైన రహానె.. రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి (119; 197 బంతుల్లో 14 ఫోర్లు) శతకం సాధించాడు. మొత్తం 260 నిమిషాలు పాటు క్రీజ్‌లో ఉండి ప్రత్యర్థి బౌలర్లకు పరీక్షగా నిలిచిన రహానే జట్టుకు భారీ ఆధిక్యం సాధించడంలో తోడ్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment