సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో అఖిల్, సాయి దివ్య విజేతలుగా నిలిచారు. సంఘి నగర్‌లోని కమలా రాణి స్కూల్‌లో బుధవారం జరిగిన ఈ పోటీల్లో అండర్-18 బాలుర విభాగంలో అఖిల్ గెలుపొందగా, గంగాధర్, రజనీకాంత్ వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. బాలికల కేటగిరీలో సాయి దివ్య, జ్యోత్ల, పల్లవి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్-16 బాలుర విభాగంలో రాకేశ్ విజేతగా నిలువగా, సాయి కుమార్‌కు రెండో స్థానం, రాజుకు మూడో స్థానం లభించాయి. బాలికల్లో రేష్మ గెలుపొందగా, సంగీత, శిరీష వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. అండర్-14 బాలుర విభాగంలో ప్రణయ్ నెగ్గగా, రిషీంద్ర, జీవన్ రెండు, మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. బాలికల కేటగిరీలో శిరీష విజేతగా నిలిచింది.
చాందినికి రెండు, సుప్రియా కుమారికి మూడో స్థానం దక్కాయి. వీరంతా రాష్ట్ర స్థాయి సైక్లింగ్‌పోటీల్లో తలపడే రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. రేపటి (శుక్రవారం) నుంచి 11వ తేదీ వరకు వరంగల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయి. అంతకుముందు స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ ఈవెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రంగారెడ్డి జిల్లా సైక్లింగ్ అధ్యక్షుడు పి. మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
సైక్లింగ్ చాంప్స్ అఖిల్, సాయి దివ్య
Published Thu, Sep 8 2016 11:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement
Advertisement