బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో లీ చోంగ్ వీ (మలేసియా), షిజియాన్ వాంగ్ (చైనా) విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ 21-13, 21-18తో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా)పై... మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ షిజియాన్ వాంగ్ 21-19, 21-18తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించారు.
వరుసగా ఆరో ఏడాది ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న లీ చోంగ్ వీ మూడోసారి టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మహ్మద్-హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) ద్వయం దక్కించుకుంది.
‘ఆల్ ఇంగ్లండ్’ చాంప్స్ లీ చోంగ్ వీ, వాంగ్
Published Mon, Mar 10 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement