సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వేస్ వాలీబాల్ చాంపియన్‌షిప్ సోమవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు.
ఈనెల 22 వరకు జరుగనున్న ఈ టోర్నీలో జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్, రైల్వే ప్రొటెక్టింగ్ ఫోర్స్‌లకు చెందిన 20 జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. జట్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు అర్జున్ ముండియా, కార్యదర్శి ఈవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment