
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ పురుషుల జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు భారత క్రికెటర్ అంబటి రాయుడు సారథ్యం వహించనున్నాడు. కోచ్‌గా ఎన్. అర్జున్ యాదవ్, మేనేజర్‌గా ఎస్. వైజయంత్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. న్యూఢిల్లీలో ఈనెల 20 నుంచి మార్చి 3 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది.
జట్టు వివరాలు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఆశిష్ రెడ్డి, సాకేత్ సాయిరాం, సీవీ మిలింద్, హిమాలయ్ అగర్వాల్, మొహమ్మద్ సిరాజ్, జె. మల్లికార్జున్ (వికెట్ కీపర్), ఆకాశ్ భండారి, టి. రవితేజ, అర్జున్ యాదవ్ (కోచ్), ఎన్‌పీ సింగ్ (బౌలింగ్ కోచ్), టి. దిలీప్ (ఫీల్డింగ్ కోచ్), వైజయంత్ (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్).
Comments
Please login to add a commentAdd a comment