ఒళ్లమ్ముకున్న అథ్లెట్
ఒళ్లమ్ముకున్న అథ్లెట్
Published Sat, May 7 2016 1:11 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM
ఐపీఎల్ చూస్తున్నారుకదా.. ఒక్కో జట్టు ధరించే దుస్తులపై డజనుకుపైగా బ్రాండ్ల లోగోలు దర్శనమిస్తాయి. ఇక బౌండరీ చుట్టూ ఎల్ ఈడీల వెలుగుల్లో, గ్రౌండ్ లోపల పెద్దపెద్ద అక్షరాల్లో.. ఎక్కడ చూసినా ప్రకటనలే ప్రకటనలు. అవునుమరి స్థలం ఎక్కడున్నా దాని విలువ దానిదే. అది నేలమీదా, ఆర్టీసీ బస్సులో, సినిమా టికెట్ పైన, క్రికెటర్ బ్యాట్ పై, వేసుకునే జెర్సీపైనా అన్నది పాయింట్ కాదు. స్పేస్ ఈజ్ ద మోస్ట్ వ్యాల్యుబుల్ థింగ్! ఈ విషయాన్ని పూర్తిగా వంటపట్టించుకున్న ఓ అథ్లెట్ ఏకంగా తన ఒంటిని యాడ్స్ కోసం అమ్మేశాడు. ఇంచుకు ఇంత చొప్పున భారీ ధరకు శరీరంలోని స్పేస్ ని అమ్ముకున్నాడు.
నిక్ సైమండ్స్.. యూఎస్ అథ్లెట్. గత ఒలింపిక్స్ లో రిలే రన్నింగ్ రేసులో అమెరికాకు పతకాన్ని సాధించిపెట్టాడు. రియో ఒలింపిక్ కు కూడా ఎంపికైన ఇతను తన కుడిభుజంపై తొమ్మిది ఇంచుల స్థలంలో టాటూ యాడ్ ను ముద్రించుకోవచ్చంటూ ప్రకటన ఇచ్చాడు. చదరపు ఇంచుకు కనీస ధర 2,44 డాలర్లుగా నిర్ధారించాడు. ప్రముఖ వేలం సంస్థ 'ఈ-బే' సైమండ్స్ భుజాన్ని వేలానికి పెట్టింది. వేలంలో టీ మొబైల్ కంపెనీ రూ.14,51,835(21,800 డాలర్ల) రికార్డు ధరకు సైమండ్స్ భుజంపై స్పేస్ ను దక్కించుకుంది. ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానున్న రియో ఒలింపిక్ లో ఇతనుకూడా ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాడు.
నాట్ ఫర్ మనీ.. ఫర్ కాజ్!
నిక్ సైమండ్స్.. యూఎస్ అథ్లెట్. రిలే రన్నింగ్ రేసులో అమెరికాకు పతకాన్ని సాధించిపెట్టాడు(2012లో) అథ్లెట్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇతను రకరకాల బ్రాండ్లకు అంబాసిడర్ కూడా. అయితే ప్రాక్టీస్ ను పక్కన పెట్టి యాడ్స్ షూటింగ్ లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న సైమండ్స్ పై అమెరికా ఒలింపిక్ సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. పరిమితికి మించి ప్రకటనలు చేయొద్దంటూ ఆంక్షలు విధించింది. స్వతహాగా స్వేచ్ఛాజీవి అయిన నిక్.. ఒలింపిక్ సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అథ్లెట్లకు తమ వ్యక్తిగత సమయంపై, శరీరంపై పూర్తిహక్కులు ఉండాల్సిందేనని ఏకంగా 'ఓన్ యువర్ స్కిన్ మూమెంట్' ఉద్యమాన్నే లేవదీశాడు. శరీరంపై తనకున్న హక్కును చాటిచెప్పేందుకే ఈ పని చేశానని చెబుతున్నాడు నిక్ సైమండ్స్.
Advertisement
Advertisement