మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: జాతీయ అండర్-16 పైకా క్రీడల వాలీబాల్‌లో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఏపీ జట్టు 25-16, 25-18, 25-18 తేడాతో యూపీపై గెలుపొందింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో రాష్ట్రానికి మూడు స్వర్ణాలు, 9 రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 17 పతకాలు దక్కాయి.
బాలుర విభాగం అథ్లెటిక్స్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ 21 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఈ విభాగంలో హర్యానా 25 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. అథ్లెటిక్స్ బాలికల టీమ్ చాంపియన్‌షిప్‌ను కేరళ గెలుచుకుంది.
వాలీబాల్ విజేత ఆంధ్రప్రదేశ్
Published Sat, Jan 11 2014 1:24 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement