మరో ‘సూపర్’ టోర్నీకి సింధు సిద్ధం | Another 'super' to prepare for the tournament in the Gulf | Sakshi
Sakshi News home page

మరో ‘సూపర్’ టోర్నీకి సింధు సిద్ధం

Published Mon, Oct 24 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

మరో ‘సూపర్’ టోర్నీకి సింధు సిద్ధం

మరో ‘సూపర్’ టోర్నీకి సింధు సిద్ధం

పారిస్: తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ప్రయత్నం చేయనుంది. మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి రోజు క్వాలిఫరుుంగ్ మ్యాచ్‌లు ఉంటారుు. బుధవారం మెరుున్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతారుు. తొలి రౌండ్‌లో రుుప్ పుయ్ రుున్ (హాంకాంగ్)తో సింధు తలపడుతుంది.

ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెరుున్), రియో కాంస్య పతక విజేత నొజోమి ఒకుహారా (జపాన్), మాజీ ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చివరి నిమిషంలో వైదొలగడంతో సింధుకు టైటిల్ గెలిచేందుకు మంచి అవకాశం ఉంది. తొలి రౌండ్‌ను సింధు దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో హీ బింగ్‌జియావో (చైనా)తో ఆడే చాన్‌‌స ఉంది. పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్, ప్రణయ్, సారుుప్రణీత్ బరిలో ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement