super series
-
రన్నరప్‌తో సింధు సరి
-
రన్నరప్‌తో సింధు సరి
కౌలూన్: గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుకు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో మాత్రం నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ సింధు 15-21, 17-21 తేడాతో మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్‌లో కూడా ఆకట్టుకోలేకపోయింది. తొలి గేమ్‌లో 6-3 ముందంజ వేసిన సింధు.. ఆ తరువాత వరుసగా ఆరుపాయింట్లను కోల్పోయింది. దాంతో గేమ్‌పై పట్టు సాధించిన తై జు యింగ్ మరింత ముందుకు దూసుకుపోయింది. కాగా, సింధు 11-18తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించినా ఆ గేమ్‌ను రక్షించుకోలేపోయింది. ఇక రెండో గేమ్‌లో ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. దాదాపు 10 పాయింట్ల వరకూ నువ్వా-నేనా అన్నట్లు పోరు కొనసాగింది. అయితే ఆ తరువాత అనవసర తప్పిదాలతో సింధు పలు పాయింట్లను చేజార్చుకుంది. రెండో గేమ్ చివర్లో సింధు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో తై జు యింగ్ కచ్చితమైన ప్రణాళికలతో ఆకట్టుకుని సింధును నిలువరించింది. ఇది తై జు యింగ్ కెరీర్లో రెండో హాంకాంగ్ ఓపెన్ సిరీస్ టైటిల్. అంతకుముందు 2014లో తొలిసారి ఈ టైటిల్‌ను తై జు సాధించింది. -
మరో ‘సూపర్’ టోర్నీకి సింధు సిద్ధం
పారిస్: తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ప్రయత్నం చేయనుంది. మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి రోజు క్వాలిఫరుుంగ్ మ్యాచ్‌లు ఉంటారుు. బుధవారం మెరుున్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతారుు. తొలి రౌండ్లో రుుప్ పుయ్ రుున్ (హాంకాంగ్)తో సింధు తలపడుతుంది. ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెరుున్), రియో కాంస్య పతక విజేత నొజోమి ఒకుహారా (జపాన్), మాజీ ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చివరి నిమిషంలో వైదొలగడంతో సింధుకు టైటిల్ గెలిచేందుకు మంచి అవకాశం ఉంది. తొలి రౌండ్‌ను సింధు దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో హీ బింగ్జియావో (చైనా)తో ఆడే చాన్స ఉంది. పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్, ప్రణయ్, సారుుప్రణీత్ బరిలో ఉన్నారు. -
డబుల్స్ చాంప్ రిత్విక్ జోడి
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ సత్తాచాటాడు. డబుల్స్‌లో విజేతగా నిలవడంతో పాటు సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో రిత్విక్-ఆర్యన్ జవేరీ జోడి 6-1, 7-5తో అమిత్- కిరణ్ దేవ జంటపై నెగ్గింది. సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ 4-6, 6-7తో ఓజెస్ త్యాజో (తమిళనాడు) చేతిలో ఓడాడు. -
సైనా... ఈసారైనా!
‘ఆల్ ఇంగ్లండ్’ ఓపెన్ బరిలో భారత స్టార్ బర్మింగ్హమ్: కొత్త ఏడాదిలో సయ్యద్ మోడి ‘గ్రాండ్‌ప్రి గోల్డ్’ టైటిల్స్ నెగ్గి శుభారంభం చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ‘సూపర్ సిరీస్’ సీజన్‌ను కూడా ‘సూపర్'గా ఆరంభించాలనే లక్ష్యంతో ఉన్నారు. గతంలో జనవరిలోనే మలేసియా ఓపెన్‌తో సూపర్ సిరీస్ టోర్నమెంట్ల సీజన్ మొదలయ్యేది. అయితే ఈ ఏడాది నుంచి ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌తో సూపర్ సిరీస్ టోర్నమెంట్ల సీజన్ ప్రారంభంకానుంది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ప్రపంచ బ్యాడ్మింటన్లోని అగ్రశ్రేణి క్రీడాకారులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజున కేవలం క్వాలిఫయింగ్ విభాగాల్లో మ్యాచ్‌లు ఉంటాయి. బుధవారం నుంచి అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీగా పేరున్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌ను 5 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 10 లక్షలు)తో నిర్వహిస్తున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 37,500 డాలర్ల (రూ. 23 లక్షల 22 వేలు) చొప్పున లభిస్తాయి. వరుసగా తొమ్మిదో ఏడాది... తన కెరీర్లో మొత్తం ఎనిమిది సూపర్ సిరీస్ టైటిల్స్‌ను నెగ్గిన సైనా ఖాతాలో ‘ఆల్ ఇంగ్లండ్’ ఓపెన్ ఇంకా చేరలేదు. వరుసగా తొమ్మిదో ఏడాది ఈ టోర్నీలో ఆడనున్న సైనా గతంలో రెండుసార్లు (2010, 2013) సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా ఆడనుంది. గాయం కారణంగా సింధు ఈ టోర్నీలో బరిలోకి దిగడం లేదు. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌తోపాటు ప్రపంచ ఐదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ మెయిన్ ‘డ్రా'లో ఉన్నారు. గతేడాది లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ సాధించిన శ్రీకాంత్... ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన కశ్యప్ ఈ మెగా టోర్నీలో ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. తొలి రౌండ్లో ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో కశ్యప్; కెంటో మెమోటా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతారు. ఇప్పటివరకు నేను ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ గెలువలేదు. రెండుసార్లు సెమీస్‌కు చేరినా తదుపరి అడ్డంకిని దాటలేకపోయాను. ఈ ఏడాది నా రికార్డును సవరించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. ఈ టైటిల్ సాధించాలన్నది నా స్వప్నం. గత నెలంతా చక్కగా గడిచింది. బెంగళూరులో తీవ్రంగా సాధన చేశాను. దేవుడి దయతో ఫిట్నెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈసారి మెరుగ్గా రాణిస్తాననే విశ్వాసంతో ఉన్నాను. -సైనా -
అడగండి చెబుతాం...
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సూపర్ సిరీస్, గ్రాండ్ ప్రి గోల్డ్, గ్రాండ్ ప్రి తదితర పేర్లతో టోర్నీలు జరుగుతుంటాయి. వీటిని ఎలా వర్గీకరించారు. ప్రధాన తేడా ఏమిటి? ప్రశ్న అడిగిన వారు: జి. వినయ్ కుమార్, ఒంగోలు బ్యాడ్మింటన్‌లో నిర్వహించే ఈ టోర్నీల మధ్య ప్రధాన తేడా ప్రైజ్‌మనీ, ర్యాంకింగ్ పాయింట్ల ఆధారంగా ఉంటుంది. ఇందులో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయి ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఉంటుంది. వీటిలో విజేతగా నిలిస్తే 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి. ఈ రెండు ఈవెంట్లలోనూ ప్రైజ్‌మనీ ఉండదు. పై రెండింటిని మినహాయిస్తే...సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీకి అగ్రస్థానం దక్కుతుంది. ఇవి ఏడాదిలో 5 జరుగుతాయి. ప్రస్తుతం ఇండోనేసియా, ఆల్‌ఇంగ్లండ్, డెన్మార్క్, మలేసియా, చైనాలను సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలుగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్‌తో వీటిని పోల్చవచ్చు. ఇందులో 9,400 ర్యాంకింగ్ పాయింట్లు దక్కే అవకాశం ఉంటుంది. ప్రైజ్‌మనీ 3 లక్షల 50 వేల డాలర్లు ఆపైన ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం వీటిలో టాప్-10 ఆటగాళ్లంతా తప్పనిసరిగా పాల్గొనాలి. ప్రీమియర్ కాకుండా మరో 7 సూపర్ సిరీస్ టోర్నీలది తర్వాతి స్థానం. ఇండియా ఓపెన్ ఇందులోనే ఉంది. వీటిలో గెలిస్తే 8,500 ర్యాంకింగ్ పాయింట్లు దక్కుతాయి. ప్రైజ్‌మనీ 2 లక్షల 50 వేలకు పైగా ఉంటుంది. పైన చెప్పిన 12 టోర్నీల్లో ప్రదర్శనను బట్టి టాప్-8లో నిలిచిన ఆటగాళ్లు ఏడాది చివర్లో సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తలపడతారు. ఆ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో వరుసగా గ్రాండ్ ప్రి గోల్డ్ (1 లక్షా 50 వేల డాలర్ల వరకు ప్రైజ్‌మనీ), గ్రాండ్ ప్రి (50 వేల నుంచి 1 లక్ష డాలర్ల వరకు) ఉంటాయి. వీటి స్థాయిని బట్టి పాయింట్లలో తేడా ఉంటుంది. ఇక వర్ధమాన ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తాను నిరూపించుకునేందుకు వరుసగా ఇంటర్నేషనల్ చాలెంజర్, ఇంటర్నేషనల్ సిరీస్, ఫ్యూచర్ సిరీస్ టోర్నీలు జరుగుతాయి. -
శ్రీకాంత్ ఓటమి
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లోని చివరి రౌండ్లో శ్రీకాంత్ 19-21, 21-10, 17-21తో కెంటో మొమొత (జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ పోరులో ఈ గుంటూరు జిల్లా కుర్రాడు 21-13, 21-8తో క్రిస్టియాన్ లిండ్ థామ్సన్ (డెన్మార్క్)పై అలవోక విజయం సాధించాడు. భారత ఆటగాళ్లు సౌరభ్ వర్మ, ప్రణయ్‌లు కూడా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. అయితే మరో అగ్రశ్రేణి ఆటగాడు ఆనంద్ పవార్ మాత్రం మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. ఇతను రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 21-7, 21-17తో దితెర్ డామ్కీ (జర్మనీ)పై గెలిచాడు. బుధవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ పోటీల్లో భారత స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, సింధు, కశ్యప్, గురుసాయిదత్, అజయ్ జయరామ్ బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో స్టెఫానీ (బల్గేరియా)తో; ఎరికో హిరోస్ (జపాన్)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో డారెన్ లూ (మలేసియా)తో కశ్యప్; హూ యున్ (హాంకాంగ్)తో గురుసాయిదత్; బూన్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో అజయ్ జయరామ్; చెన్ లాంగ్ (చైనా)తో ఆనంద్ పవార్ పోటీపడతారు.