ధోనిపై వారెంట్ తొలగింపు | AP court recalls bailable warrant issued against Mahendra Singh Dhoni | Sakshi
Sakshi News home page

ధోనిపై వారెంట్ తొలగింపు

Published Thu, Jul 17 2014 1:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

AP court recalls bailable warrant issued against Mahendra Singh Dhoni

అనంతపురం లీగల్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై వారెంట్‌ను అనంతపురం షెడ్యూల్డ్ కులాలు, తెగల కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి విజయకుమార్ తొలగించారు.
 
  కోర్టు నోటీసులు తమకు అందలేదని, ధోని ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నందున అతనిపై జారీ చేసిన వారెంట్‌ను తొలగించాలని ధోని తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. మరో వైపు ధోని బొమ్మ ప్రచురించిన పత్రిక తరఫు న్యాయవాది, అది ఊహా చిత్రమేనని, తాము ఏ దేవుడినీ కించపరచలేదని వివరణ ఇచ్చారు. తదుపరి విచారణకు కేసును ఈ నెల 25కు వాయిదా వేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement