అపూర్వీ అద్భుతం | Apurvi Chandela sets a world record to win gold at Swedish Grand Prix | Sakshi
Sakshi News home page

అపూర్వీ అద్భుతం

Published Thu, Jan 7 2016 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

అపూర్వీ అద్భుతం

అపూర్వీ అద్భుతం

ప్రపంచ రికార్డుతో స్వర్ణం
 న్యూఢిల్లీ:
భారత మహిళా షూటర్ అపూర్వీ చండీలా అద్భుతం చేసింది. స్వీడిష్ కప్ గ్రాండ్‌ప్రి షూటింగ్ టోర్నమెంట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అపూర్వీ 211.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వీ 211 పాయింట్లతో యి సిలింగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆస్ట్రిడ్ స్టెఫెన్సన్ (స్వీడన్-207.6 పాయింట్లు), స్టిన్ నీల్సన్ (స్వీడన్-185 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ రాజస్తాన్ షూటర్ తాజా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement