భారత్ తో జరుగుతున్న ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో ఆసీస్ 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
రాజ్ కోట్: భారత్ తో జరుగుతున్న ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో ఆసీస్ 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆసీస్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఓపెనర్లు ఫించ్ , మిడ్డిన్ సన్ లు శుభారంభాన్నిచ్చారు. భారత బౌలర్లును ఫించ్ వీరబాదుడు బాదుతుంటే, మిడ్డిన్ సన్ అతనికి చక్కటి సహకారం అందించి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. ఫించ్ 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 89 పరుగులు చేయగా, మిడ్డిన్ సన్ 6ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 34 పరుగులు చేశాడు. ఫించ్ ఆడుతున్నంతసేపు టీమిండియా ఆటగాళ్లకు చుక్కలు కనిపించాయి. బంతిని వేయడమే తరవాయి అన్నట్లు అతని బ్యాటింగ్ శైలి కొనసాగింది.
చివర్లో మ్యాక్స్ వెల్ (27) పరుగులు చేసి ఫించ్ కు సహకారాన్ని అందించాడు. ఫించ్ సెంచరీ దిశగా సాగుతున్నతరుణంలో ప్రవీణ్ కుమార్ చక్కటి బంతితో అతన్ని పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆసీస్ నిర్ణీత20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ప్రవీణ్ కుమార్ లకు తలో మూడు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్టు దక్కింది.