Twenty 20
-
ధోని రికార్డును బ్రేక్ చేశాడు...
అబుదాబి: జింబాబ్వేతో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 47 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అస్గర్ కెప్టెన్సీలోని అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (35 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. ఉస్మాన్ ఘనీ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), అస్గర్ (12 బంతుల్లో 24; 1 ఫోరు, 2 సిక్స్‌లు) కూడా తోడవ్వడంతో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు సాధించింది. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడిపోయింది. సికిందర్ రజా (41 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ర్యాన్ బుర్ల్ (31 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. నజీబుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’.... సిరీస్‌లో 100 పరుగులతో పాటు ఐదు వికెట్లు తీసిన అఫ్గాన్ ఆల్‌రౌండర్ కరీమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఇక్కడ చదవండి: వైరల్: బట్లర్ తీరుపై కోహ్లి ఆగ్రహం ధోని రికార్డును బ్రేక్ చేసిన అస్గర్ ఇదిలా ఉంచితే, అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 42 విజయాలను సాధించిన కెప్టెన్‌గా నయా రికార్డు లిఖించాడు. అస్గర్ సారథ్యంలో అఫ్గానిస్తాన్ 42 విజయాలు సాధించింది. అస్గర్ 52 టీ20 మ్యాచ్‌లకు అఫ్గాన్ తరఫున నాయకత్వం వహించగా, అందులో 42 విజయాలు సాధించడం విశేషం. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 72 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 41 మ్యాచ్‌ల్లో విజయాలు అందించాడు. ఇది ఇప్పటివరకూ ధోని పేరిట ఉండగా, తాజాగా అస్గర్ పేరిట లిఖించబడింది. ఆస్గర్, ధోని తర్వా త స్థానాల్లో టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. మోర్గాన్ ఇప్పటివరకూ 59 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 33 విజయాలను అందించాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటివరకూ 45 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 27 విజయాలను దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చదవండి: కోహ్లి ఓపెనింగ్ చేస్తే నాకు అభ్యంతరమేంటి! -
న్యూజిలాండ్ తో టీ20 భారత్ ఘన విజయం
-
టి20 జట్టులో మాథ్యూస్ రీఎంట్రీ
కొలంబో: దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్ శ్రీలంక టి20 జట్టులోకి వచ్చాడు. భారత్‌తో ఈనెల 5న మొదలయ్యే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది సభ్యులుగల జట్టుకు లసిత్ మలింగ సారథ్యం వహిస్తాడు. 32 ఏళ్ల మాథ్యూస్ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్ షనక, కుశాల్ పెరీరా, డిక్వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, సందకన్, కసున్ రజిత. -
టీ20 సిరీస్‌ను ‘స్వీప్’ చేశారు
కతునాయకే: శ్రీలంక మహిళలతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ ఓటమి లేకుండా ముగించింది. సోమవారం జరిగిన నాల్గో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళలు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సైతం అదే జోరు కనబర్చారు. కనీసం చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న ఆతిథ్య శ్రీలంకకు భారత్ మరోసారి చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, లంక మహిళలు 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలారు. పూనమ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, రాధా యాదవ్, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. దాంతో భారత్ 51 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 4-0 తో ‘స్వీప్’ చేసింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా, మిగతా వాటిలో భారత్ విజయ ఢంకా మోగించింది. తాజా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 18.3 ఓవర్లలో 156 పరుగులు చేశారు. ఓపెనర్లు మిథాలీ రాజ్(12), స్మృతీ మంధాన(0) నిరాశపరిచినప్పటికీ, జెమీమా రోడ్రిగ్స్(46) మరోసారి ఆకట్టుకున్నారు. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(63;38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
టీ20 సిరీస్ భారత మహిళలదే
కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత మహిళలు ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే చేజిక్కించుకున్నారు. సోమవారం జరిగిన నాల్గో టీ20లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించారు. శ్రీలంక నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింద. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మిథాలీ రాజ్(11), స్మృతీ మంధాన(5)లు విఫలమైనప్పటికీ, జెమిమా రోడ్రిగ్స్(52 నాటౌట్;37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అనుజా పాటిల్(54 నాటౌట్; 42 బంతుల్లో 7ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రోడ్రిగ్స్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఈ జోడి అజేయంగా 96 పరుగులు జోడించడంతో భారత్ 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రపు ఐదో టీ20 మంగళవారం జరుగనుంది. -
క్రికెట్ చరిత్రలో తొలి బౌలర్‌గా..
హమిల్టన్: క్రికెట్లో బ్యాట్స్‌మెన్, కీపర్, స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నవారు హెల్మెట్ పెట్టుకోవడం సాధారణ విషయం. అంతేకాకుండా డేంజర్ జోన్లో ఫీల్డింగ్ చేసే వారు సైతం హెల్మెట్లను ధరించడం మనం చూశాం. అయితే తాజాగా ఓ బౌలర్ హెల్మెట్ పెట్టుకుని బౌలింగ్ చేసిన ఘటన న్యూజిలాండ్ దేశవాళీ టీ 20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. న్యూజిలాండ్ సీమర్ వారెన్ బార్నెస్ తలకు హెల్మెట్‌కు పెట్టుకుని బౌలింగ్ చేశాడు. దాంతో ఇప్పటివరకూ క్రికెట్లో కొనసాగుతున్న సంప్రదాయానికి బార్నెస్ చెక్ పెట్టాడు. హమిల్టన్ వేదికగా సెడాన్ పార్క్‌లో ఒటాగో-నార్తరన్ నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. తొలుత నార్తరన్ నైట్స్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ కాలుకు బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి తాకింది. ఆ బంతి తలకి తాకి ఉంటే ఇంకేమైనా ఉందా? అని భావించిన వారెన్ తాను బౌలింగ్ వేస్తున్నప్పుడు బేస్‌బాల్ అంపైర్ ధరించే హెల్మెట్‌ను పెట్టుకుని మరీ బౌలింగ్ వేశాడు. మ్యాచ్ అనంతరం తాను హెల్మెట్ ధరించడాన్ని వారెన్ సమర్థించుకున్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు తన తల నేరుగా బ్యాట్స్‌మెన్ వైపే ఉంటుందని, కాబట్టి బ్యాట్స్‌మెన్ కొట్టే బంతి తలకు తాకే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో బౌలింగ్ వేసే సమయంలో హెల్మెట్ ధరించిన తొలి బౌలర్‌గా బార్నెస్ గుర్తింపు పొందాడు. -
విజేత హైదరాబాద్ ఈసీడీజీ
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్ స్టేట్ ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఈసీడీజీ సీనియర్ జట్టు విజేతగా నిలిచింది. జూనియర్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అక్కడి సెయింట్ లారెన్స్ అకాడమీ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో ఈసీడీజీ సీనియర్ జట్టు 123 పరుగుల తేడాతో దినేశ్ వర్మ క్రికెట్ ఫౌండేషన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆసిఫ్ బాష (80) రాణించగా, రకెల్ బారీ 30, అలీఖాన్ 18 పరుగులు చేశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దినేశ్ వర్మ క్రికెట్ ఫౌండేషన్ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. ఈసీడీజీ బౌలర్లు అనిల్ కుమార్ 3, హరమ్, చరణ్ చెరో 2 వికెట్లు తీశారు. జూనియర్స్ ఫైనల్లో సెయింట్ లారెన్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ఈసీడీజీ జూనియర్స్‌పై గెలిచింది. తొలుత ఈసీడీజీ జూనియర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఐజాజ్ (86 నాటౌట్) అర్ధసెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లలో గౌరవ్, గజి రెండేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లారెన్స్ క్రికెట్ అకాడమీ జట్టు 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. సంచిత్ (80 నాటౌట్) తుదికంటా అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈసీడీజీ బౌలర్లలో యాసిన్, అక్షయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
దంచుడే..దంచుడు..!
-
ధోని మరో వరల్డ్ రికార్డు
కొలంబో:శ్రీలంకతో జరిగిన దైపాక్షిక సిరీస్ ద్వారా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పలు ఘనతల్ని సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో మూడొందల మ్యాచ్ ల మైలురాయిని దాటడంతో పాటు వంద స్టంపింగ్ ల రికార్డును, అత్యధిక నాటౌట్ల రికార్డును సైతం లంక పర్యటనలో ధోని సాధించారు. అయితే ఇదంతా లంకేయులతో ఐదు వన్డేల సిరీస్ ను ఆడే క్రమంలో ధోని సాధించిన ఘనతలు. కాగా, శ్రీలంకతో బుధవారం జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో ధోని మరో వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. విదేశాల్లో అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్ గా ధోని రికార్డు నెలకొల్పారు. నిన్నటి మ్యాచ్ లో ఏంజెలో మాథ్యూస్ ను స్టంప్ అవుట్ రూపంలో ధోని అవుట్ చేశారు. దాంతో విదేశాల్లో 476 అవుట్లను ధోని సాధించాడు. తద్వారా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్(475) పేరిట ఉన్న రికార్డును ధోని బద్దలు కొట్టారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్(460) మూడో స్థానంలో ఉన్నారు. మరొకవైపు ట్వంటీ 20ల్లో అత్యధిక అవుట్లు చేసిన రికార్డు కూడా ధోని పేరిట ఉండటం విశేషం. ట్వంటీ 20ల్లో ధోని 67 అవుట్లు చేసి అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్(60) నిలిచాడు. ఇదిలా ఉంచితే, లంకేయులతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా మొత్తం మ్యాచ్ ల్లో ధోని నాటౌట్ గా నిలిచారు. లంక పర్యటన పలు ఘనతలతో ధోనికి తీపి జ్ఞాపకాలను మిగిల్చిందనే చెప్పాలి. -
మెకల్లమ్ రికార్డును బ్రేక్ చేశాడు!
లండన్:ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్ ఆడమ్ లైత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన సంచలన బ్యాటింగ్ తో ట్వంటీ 20 ఫార్మాట్ లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాట్‌వెస్ట్ ట్వంటీ 20 బ్లాస్ట్ లో భాగంగా యార్కషైర్ తరపున బరిలోకి దిగిన లైత్.. 161 పరుగులు సాధించాడు. తద్వారా ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ నమోదు చేసిన 158 పరుగుల రికార్డును బద్ధలు కొట్టాడు. గతంలో మెకల్లమ్ రెండు సార్లు 158 పరుగుల మార్కును చేరుకున్నాడు. 2008 ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగి అజేయంగా 158 పరుగులు చేశాడు. ఆ తరువాత 2015లో వార్విక్ షైర్ తరపున ఆడే క్రమంలో అదే పరుగుల ఘనతను మెకల్లమ్ సాధించాడు. అయితే ట్వంటీ 20 ల్లో టాప్ స్కోరర్ రికార్డు క్రిస్ గేల్ (175*) పేరిట ఉంది. గురువారం నార్తాంప్టన్‌షైర్ తో జరిగిన మ్యాచ్ లో ఆడమ్ చెలరేగి ఆడాడు. 73 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. దాంతో యార్క్‌షైర్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. అయితే వరల్డ్ రికార్డుకు యార్క్‌షైర్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మరో నాలుగు పరుగులు చేసుంటే ట్వంటీ 20 ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా యార్క్‌షైర్ నిలిచేది. గతేడాది సెప్టెంబర్ లో శ్రీలంకతో జరిగిన ఆస్ట్రేలియా చేసిన 263 పరుగులే ట్వంటీ 20 ఫార్మాట్ లో అత్యధిక స్కోరు. -
ట్వంటీ 20 చరిత్రలో తొలిసారి..
టాన్‌టాన్:ఒక క్రికెటర్ బంతిని అడ్డుకుని అవుట్ గా పెవిలియన్ చేరడం చాలా అరుదు. అయితే దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన రెండో ట్వంటీ 20లో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఇదే తరహాలో అవుటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సఫారీ బౌలర్ క్రిస్ మోరిస్ వేసిన 15 ఓవర్ తొలి బంతిని స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న లివింగ్ స్టోన్ బ్యాక్వర్డ్ పాయింట్లోకి ఆడి సింగిల్ తీసే యత్నం చేశాడు. ఇదే క్రమంలో అవతలి ఎండ్ లో ఉన్న జాసన్ రాయ్ కు సింగిల్ కు రమ్మంటూ అరిచాడు. కాగా, మళ్లీ వద్దంటూ సైగ చేయడంతో క్రీజ్ ను సగానికి పైగా దాటి వచ్చిన జాసన్ రాయ్ వెనక్కి వేగంగా కదలబోయాడు. అదే సమయంలో తన గమనాన్ని మార్చుకుంటూ దక్షిణాఫ్రికా ఫీల్డర్ వికెట్లపైకి విసిరిన బంతికి అడ్డుపడ్డాడు. జాసన్ రాయ్ ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డాడని దక్షిణాఫ్రికా అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు నివేదించారు. దీన్ని పరిశీలించిన థర్డ్ అంపైర్ రాబిన్స్సన్..జాసన్ రాయ్ ను అవుట్ గా ప్రకటించాడు. దాంతో 67 పరుగుల వద్ద రాయ్ మూడో వికెట్ గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే అంతర్జాతీయ ట్వంటీ 20 క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇలా అవుట్ కావడం ఇదే తొలిసారి. తన కెరీర్ లో ఎన్నో ఘనతల్ని సాధించిన జాసన్ రాయ్.. ఇలా అవుటై చరిత్రలో నిలవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 174 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఆరు వికెట్లకు 171 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. -
ముంబై ఇండియన్స్ అరుదైన ఫీట్
కోల్ కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో కోల్ కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్కు చేరింది. అయితే ముంబై ఇండియన్స్ మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. ట్వంటీ 20 క్రికెట్ లో వంద మ్యాచ్ ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా ముంబై అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 176 ట్వంటీ 20 మ్యాచ్ లాడిన ముంబై వంద విజయాలు సాధించగా, 73 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. మరో గేమ్ టైగా ముగియగా, రెండు రద్దయ్యాయి. కాగా, ఐపీఎల్లో మాత్రం ముంబైకు ఇది 89వ విజయం. ఓవరాల్ ఐపీఎల్లో 154 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ 64 మ్యాచ్ ల్లో ఓటమి చెందగా, ఒకటి టైగా ముగిసింది. 2010 నుంచి 2014 వరకూ చాంపియన్స్ లీగ్ లో ముంబై ఇండియన్స్ 11 విజయాల్ని సొంత చేసుకోగా, తొమ్మిది ఓటముల్ని చవిచూసింది. దాంతో మొత్తంగా కలుపుకుని వంద ట్వంటీ 20 విజయాల్ని సాధించిన తొలి జట్టుగా ముంబై సరికొత్త ఘనతను కైవసం చేసుకుంది. -
నాల్గోస్థానానికి పడిపోయారు..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రదర్శనతో ఆరు పాయింట్లు కోల్పోయిన భారత్ 118 పాయింట్లతో ఉంది. న్యూజిలాండ్ (125 పాయింట్లు), ఇంగ్లండ్ (121), పాకిస్తాన్ (121) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, పాక్‌ల పాయింట్లు సమమైనా కొద్దితేడాతో ఇంగ్లండ్ ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఐదు నుంచి పదిస్థానాల్లో కొనసాగుతున్నాయి. కటాఫ్ తేదీ నాటికి ర్యాంకింగ్స్‌లోని తొలి తొమ్మిది జట్లు ఆస్ట్రేలియాలో జరిగే 2020 టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్యదేశం హోదాలో ఆసీస్ నేరుగా ఆడనుంది. మిగతా ఆరు స్థానాల కోసం ర్యాంకింగ్స్‌లోని మిగతా జట్లు పోటీపడనున్నాయి. -
దక్షిణాఫ్రికా భారీ విజయం
ఆక్లాండ్:న్యూజిలాండ్ తో ఇక్కడ ఈడెన్ పార్క్ లో జరిగిన ఏకైక ట్వంటీ 20లో దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించింది. న్యూజిలాండ్ ను 107 పరుగులకే కట్టడిచేసిన సఫారీలు 78 పరుగుల తేడాతో గెలుపొందారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఓపెనర్ డీ కాక్ ఆదిలోనే డకౌట్ గా నిష్ర్కమించనప్పటికీ మరో ఓపెనర్ హషీమ్ ఆమ్లా(62) ఆదుకున్నాడు.ఆ తరువాత డు ప్లెసిస్(36), ఏబీ డివిలియర్స్(26), డుమినీ(29) ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ సఫారీలకు పోటీ ఇవ్వలేదు. టీసీ బ్రూస్(33), సౌథీ(23),గ్రాండ్ హోమ్(15)లే న్యూజిలాండ్ జట్టులో రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా, ఫెహిల్క్వాయో మూడు వికెట్లు, క్రిస్ మోరిస్ రెండు వికెట్లు తీశారు. -
ఓటమితో ముగించారు
ఆంధ్ర చేతిలో హైదరాబాద్ పరాజయం సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బౌలర్లు రాణిం చినా... బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో చివరి మ్యాచ్‌ను కోల్పోయి ఈ టోర్నీని హైదరాబాద్ జట్టు ఓటమితో ముగించింది. చెన్నైలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై 11 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు గెలుపొందింది. సౌత్‌జోన్ విభాగంలో జరిగిన పోటీల్లో మొత్తం 5 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ మొదటి 3 మ్యాచ్‌లు గెలిచి... చివరి 2 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు 19.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (49; 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రికీ భుయ్ (21; 1 ఫోర్) పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగగా... రవికిరణ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. తన్మయ్ అగర్వాల్ (49; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడగా... ఆకాశ్ భండారి (26; 1 ఫోర్, 1 సిక్సర్) రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో స్వరూప్ కుమార్ 5 వికెట్లతో విజృంభించగా...గిరినాథ్ రెడ్డి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఓపెనర్ల జోరు: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు ఓపెనర్లు భరత్ (16), హనుమ విహారి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ తొలి వికెట్‌కు 37 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం సిరాజ్ బౌలింగ్‌లో భరత్ పెవిలియన్ చేరాడు. విహారికి జతకలిసిన రికీ భుయ్ ఆచితూచి ఆడాడు. రికీ ఎక్కువగా సింగిల్స్‌కు ప్రాధాన్యమిస్తూ స్ట్రరుుక్ రొటేట్ చేయగా... విహారి దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే రవికిరణ్ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్ ఇచ్చి విహారి వెనుదిరిగాడు. గిరినాథ్ రెడ్డి (15) ఒక సిక్సర్‌తో దూకుడు కనబరిచినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. తర్వాత హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో రవితేజ (8), గణేశ్ (7), శ్రీనివాస్ (2), స్వరూప్ (6), భట్ (1), అయ్యప్ప (0), శశికాంత్ (9 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒకరి తర్వాత మరొకరు: స్వల్ప లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు విఫలమైంది. తన్మయ్ ధాటిగా ఆడినా ... మిగతా బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ అక్షత్ (7) వెనుదిరగగా... తన్మయ్, బద్రీనాథ్ (19) ఇన్నింగ్స నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత స్వరూప్ ధాటికి అనిరుధ్ (6), ఆకాశ్ (4), సుమంత్ (2) పెవిలియన్‌కు చేరారు. ఆంధ్ర బౌలర్లను ఓ ఎండ్‌లో ఆకాశ్ భండారి సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ... మరో ఎండ్‌లో హసన్ (5), మిలింద్ (5), సిరాజ్ (1) క్రీజులో నిలవలేకపోయారు. చివరి ఓవర్లో భండారి ఔటయ్యాడు. -
19 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు..
చెన్నై:అంతరాష్ట్ర ట్వంటీ 20 టోర్నమెంట్లో భాగంగా ఇక్కడ మంగళవారం గురునానక్ కాలేజ్ గ్రౌండ్ లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో గోవాకు ఘోర ఓటమి ఎదురైంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శనకే పరిమితమైన గోవా 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గోవా జట్టు 16.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. గోవా జట్టుకు ఓపెనర్లు కామత్(26), అస్నోద్కర్(33)లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ, ఆ తరువాత చతికిలబడిన గోవా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తన ఇన్నింగ్స్ లో 88 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయి పటిష్టంగా కనిపించిన గోవా వరుస విరామాల్లో వికెట్లను సమర్పించుకుంది. 19 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లను నష్టపోయిన గోవా శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఎనిమిది మంది గోవా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. అటు తరువాత గోవా నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు 13.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్(68 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ మురళీ విజయ్(16) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరుణంలో ముకుంద్ కు జతకలిసిన జగదీశన్(19 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి తమిళనాడు విజయానికి సహకరించాడు. -
ఇంగ్లండ్‌కు సాధారణ లక్ష్యం
నాగ్‌పూర్: మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా 145 పరుగుల సముచిత లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్(71;47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(21) ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆదిలో దూకుడుగా కనిపించిన కోహ్లి భారీ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం సురేష్ రైనా(7), యువరాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ 13 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో భారత్ తడబడింది. ఆ తరుణంలో రాహుల్ కు జత కలిసిన మనీష్ పాండే ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడి నాల్గో వికెట్ కు 56 పరుగుల జత చేయడంతో భారత్ తేరుకుంది. ఈ క్రమంలోనే రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే భారత్ స్కోరు 125 పరుగుల వద్ద రాహుల్ నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో మనీష్ పాండే(30;26 బంతుల్లో) ఐదో వికెట్ గా అవుట్ అయ్యాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా(2), అమిత్ మిశ్రా(0)లు రనౌట్ లుగా పెవిలియన్ కు చేరగా, మహేంద్ర సింగ్ (5) లు అవుట్ కావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు సాధించగా, మొయిన్ అలీ, రషిద్, మిల్స్ లకు తలో వికెట్ దక్కింది. -
మళ్లీ విరాట్ సేనదే బ్యాటింగ్!
నాగ్‌పూర్:భారత్ తో ఇక్కడ జరుగుతున్న రెండో ట్వంటీ 20లోఇంగ్లండ్ మరోసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. మళ్లీ టాస్ ను కోల్పోయి బ్యాటింగ్ కు చేపట్టింది. ఇప్పటికే మూడు ట్వంటీ 20ల సిరీస్ లో వెనుకబడిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. ఇందులో గెలిస్తేనే భారత్ సిరీస్ లో నిలబడతుంది. కానిపక్షంలో సిరీస్ ను కోల్పోవల్సి వస్తుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు తలో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత తుది జట్టులోకి అమిత్ మిశ్రా రాగా, ఇంగ్లండ్ జట్టులో డాసన్ వచ్చి చేరాడు. గత మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమైన భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లండ్ కు కనీసం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఇంగ్లండ్ బరిలోకి దిగుతుండగా, సిరీస్‌ను కాపాడుకోవాలని విరాట్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే, ఈ స్టేడియంలో భారత్ ఆడిన రెండు అంతర్జాతీయ ట్వంటీ 20ల్లోనూ ఓటమి పాలుకావడం జట్టును కలవరపరుస్తోంది. 2009 డిసెంబర్ నెలలో శ్రీలంకతో తొలిసారి ఇక్కడ జరిగిన తొలి టీ 20లో భారత్ పరాజయం పాలైంది. ఆ తరువాత 2016 మార్చి 15వ తేదీన న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ రెండు సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. ఇక్కడ చివరిసారి వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా మార్చి 27వ తేదీన వెస్టిండీస్-అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ ఇక్కడ 10 ట్వంటీ 20లు జరగ్గా, వాటిలో ఏడుసార్లు మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందడం విశేషం. మరి మొదట బ్యాటింగ్ చేసే విరాట్ సేన ఏం చేస్తుందో చూడాలి. భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా,యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని,మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, అమిత్ మిశ్రా, బూమ్రా,నెహ్రా, చాహల్ ఇంగ్లండ్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జాసన్ రాయ్,బిల్లింగ్స్, జో రూట్,స్టోక్స్, బట్లర్,మొయిన్ అలీ, జోర్డాన్,డాసన్, మిల్స్, రషిద్ -
చిత్తుగా ఓడిన విరాట్ సేన
కాన్పూర్: వరుసగా రెండు సిరీస్‌లను గెలిచామన్న అలసత్వం ఒకవైపు.. కలిసి కట్టుగా పోరాడి విజయం సాధించాలనే పట్టుదల మరొకవైపు.. వెరసి ఇంగ్లండ్ వరుసగా రెండో విజయం సాధించగా, విరాట్ నేతృత్వంలోని టీమిండియాకు రెండో పరాజయం ఎదురైంది. మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. తొలుత ఇంగ్లండ్ కు మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిన టీమిండియా.. ఆ తరువాత ఇంగ్లండ్ ను కట్టడి చేయడంలో విఫలమై ఓటమి పాలైంది. భారత్ విసిరిన 148 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఆడుతూ పాడుతూ 18.1 ఓవర్లలోమూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(51) ఆదుకున్నాడు. జో రూట్‌తో కలిసి మూడో వికెట్ కు 83 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించాడు. ఆ క్రమంలోనే మోర్గాన్ 38 బంతుల్లో 4 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఆ తరువాత రూట్ -స్టోక్స్‌ల జోడి మిగతా పనిని పూర్తి చేసింది. రూట్ (46 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడగా, స్టోక్స్ (2నాటౌట్) మరో వికెట్ పడకుండా అండగా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈమ్యాచ్‌లో ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(29)ఫర్వాలేదనిపించగా, మరో్ ఓపెనర్ కేఎల్ రాహుల్(8) నిరాశపరిచాడు. ఆ తరువాత సురేశ్ రైనా(34; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ తిరిగి తేరుకుంది. అయితే యువరాజ్ సింగ్(12) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో భారత్ జట్టు 75 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. కాగా, ఎంఎస్ ధోని (36 నాటౌట్;26 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మొయిన్ అలీ రెండు వికెట్లు సాధించగా, మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఇంగ్లండ్ కు సాధారణ లక్ష్యం
కాన్పూర్: మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ 148 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆది నుంచి తడబడతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(29)ఫర్వాలేదనిపించగా, మరో్ ఓపెనర్ కేఎల్ రాహుల్(8) నిరాశపరిచాడు. ఆ తరువాత సురేశ్ రైనా(34; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ తిరిగి తేరుకుంది. అయితే యువరాజ్ సింగ్(12) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో భారత్ జట్టు 75 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. కాగా, ఎంఎస్ ధోని (36 నాటౌట్;26 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ రెండు వికెట్లు సాధించగా, మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఫైనల్లో పాక్‌పై భారత్ విజయం
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో పాకిస్తాన్‌పై భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సాధించింది. భారత్ విసిరిన 122 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడి ఓడింది. పాక్ క్రీడాకారిణుల్లో అయేషా జాఫర్(15),జావిరియా ఖాన్(22), బిస్మా మరూఫ్(25) ఫర్వాలేదనిపించినా, మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. దాదాపు పది ఓవర్ల వరకూ మ్యాచ్ పాక్ వైపు మొగ్గగా, చివరి ఓవర్లలో భారత్ పైచేయి సాధించి గెలుపును సొంతం చేసుకుంది. చివరి రెండు ఓవర్లలో పాకిస్తాన్ 32 పరుగులు చేయాల్సి రావడంతో అది వారికి కష్ట సాధ్యంగా మారింది. పాకిస్తాన్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించగా,అనూజా పటేల్,జులాన్ గోస్వామి, శిఖా పాండే,ప్రీతి బోస్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. భారత ఓపెనర్ మిథాలీ రాజ్ ( 73 నాటౌట్;65 బంతుల్లో 7 ఫోర్లు1 సిక్స్) ఒంటరి పోరాటం చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకుంది. మరోవైపు మిథాలికీ జులాన్ గోస్వామి(17) కొద్దిపాటి సహకారం అందించి జట్టును కాపాడింది. భారత మిగతా క్రీడాకారిణుల్లోమందనా(6),మేఘనా(9), వేదా కృష్ణమూర్తి(2), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఘోరంగా విఫలమయ్యారు. 'ఆరే'సిన భారత్ ఇప్పటివరకే ఆరు ఆసియాకప్ మహిళా టోర్నీలు జరగ్గా ఆరింటిలో భారత్ విజేతగా నిలవడం విశేషం. 2004లో మహిళల వన్డే ఆసియాకప్ ఆరంభమైంది. అప్పట్నుంచి 2008 వరకూ నాలుగు వన్డే ఆసియాకప్‌లు జరగ్గా, ఆ తరువాత రెండు టీ 20 ఆసియాకప్‌లు జరిగాయి. చివరిసారి 2012లో జరిగిన మహిళల ఆసియాకప్ టీ 20 ఫైనల్లో పాక్‌పై భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేళ్ల తరువాత అదే ఫలితాన్ని భారత్ పునరావృతం చేసింది. -
మిథాలీ ఒంటరి పోరాటం
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20టోర్నీలో భాగంగా పాకిస్తాన్ తో ఇక్కడ ఆదివారం జరిగిన తుది పోరులో భారత ఓపెనర్ మిథాలీ రాజ్( 73 నాటౌట్;65 బంతుల్లో 7 ఫోర్లు1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. మిగతా భారత క్రీడాకారిణులు విఫలమైనా మిథాలీ చివరి వరకూ క్రీజ్‌లో నిలబడింది. దాంతో భారత్ జట్టు 122 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించకల్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే మందనా(6)వికెట్ ను నష్టపోయింది. అనంతరం మేఘనా(9), వేదా కృష్ణమూర్తి(2), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఘోరంగా విఫలమయ్యారు. కాగా, మిథాలీకి జులాన్ గోస్వామి(17) కొద్దిపాటి సహకారం అందించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. పాక్ మహిళల్లో ఆనమ్ అమిన్ రెండు వికెట్లు తీయగా, సానా మిర్, సదియా యూసఫ్‌లకు తలో వికెట్ దక్కింది. -
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తుది పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ లీగ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్.. అదే ఫలితాన్ని ఇక్కడ కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది. మరొకవైపు భారత్‌ను కంగుతినిపించాలని పాక్ యోచిస్తోంది. -
తుది పోరులో భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నమెంట్ తుది పోరులో భారత్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఇప్పటికే భారత్ మహిళలు ఫైనల్ కు చేరగా, మరో బెర్తు ఖరారు కోసం చివరి లీగ్ మ్యాచ్ వరకూ వీక్షించాల్సి వచ్చింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలుత థాయ్‌లాండ్‌ను 51 పరుగులకే కూల్చేసిన పాకిస్తాన్.. ఆ తరువాత లక్ష్య ఛేదనలో ఐదు వికెట్ల మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలో గెలుపొందింది. స్వల్ప లక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు అయేషా జాఫర్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, బిస్మా మరూఫ్(4) నిరాశపరిచింది. ఆపై అస్మావియా ఇక్బాల్(24), నిదా దార్(14)లు పరిస్థితిన చక్కదిద్దారు. మూడో వికెట్ కు 31 పరుగులు జోడించి పాక్ కు విజయాన్ని ఖరారు చేశారు. ఈ టోర్నీలో భారత్ ఐదు వరుస విజయాలతో ఫైనల్ కు చేరగా, పాకిస్తాన్ నాలుగు విజయాలతో తుది పోరుకు చేరింది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
ఎదురులేని భారత్
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక మహిళల్ని 69 పరుగులకే కట్టడి చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్(62) హాఫ్ సెంచరీ సాధించగా,మందనా(21), వేదా కృష్ణమూర్తి(21)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన లంక మహిళలు పోరాడకుండానే చేతులెత్తేశారు. దిలానీ మండోదర(20), ప్రశాదనీ వీరక్కోడి(14)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా క్రీడాకారిణులంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. భారత మహిళల్లలో ఏక్తా బిస్త్,ప్రీతి బోస్‌లు చెరో మూడు వికెట్లతో లంకను కట్టడి చేయగా,జులాన్ గోస్వామి,అనుజా పటేల్, పూనమ్ యాదవ్ లకు తలో వికెట్ దక్కింది. ఈ తాజా మ్యాచ్‌లో విజయంతో భారత్ వరుసగా నాల్గో గెలుపును సొంతం చేసుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్, థాయ్ లాండ్, పాకిస్తాన్‌లపై భారత్ వరుసగా విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే. -
పాక్ పై భారత్ విజయం
బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు జైతయాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ కొట్టింది. పాక్ విసిరిన 98 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. భారత క్రీడాకారిణుల్లో ఓపెనర్లు మిథాలీ రాజ్(36), మందనా(14)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు.అనంతరం భారత తడబడినా, మిగతా పనిని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(26 నాటౌట్) పూర్తి చేసి భారత్ కు విజయాన్ని అందించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అబిది(37 నాటౌట్) పాకిస్తాన్ జట్టులో టాప్ స్కోరర్.మరో క్రీడాకారిణి అయేషా జాఫర్(28) ఆకట్టుకుంది. భారత మహిళల్లో ఏక్తా బిస్త్ మూడు వికెట్లు సాధించగా, అనుజా పటేల్, హర్మన్ ప్రీత్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి.గత రెండు మ్యాచ్‌ల్లో థాయ్ లాండ్, బంగ్లాదేశ్‌లపై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
23 పరుగులకే చాపచుట్టేశారు..
బ్యాంకాక్:మహిళల ఆసియా కప్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నీలో అత్యల్ప స్కోర్లు నమోదు కావడం పరిపాటిగా మారిపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ మహిళలు 16.2 ఓవర్లలో 23 పరుగులకే చాపచుట్టేశారు. సోమవారం జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో నేపాల్ మహిళలు రెండంకెల స్కోరును చేయడానికే అపసోపాలు పడ్డారు. ఓపెనర్ జ్యోతి పాండే(16) మినహా ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలబడే యత్నం చేయకుండానే పెవిలియన్ చేరారు. నేపాల్ మహిళ్లలో ఏడుగురు డకౌట్లుగా పెవిలియన్ చేరగా, మరో క్రీడాకారిణి పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో నాటౌట్ గా మిగిలింది. దాంతో ఎనిమిది '0' లే నేపాల్ స్కోరు బోర్డులు దర్శనమిచ్చాయి. లంక మహిళల్లో సుగంధిక కుమారి, రణవీరాలు తలో మూడు వికెట్లు తీసి నేపాల్ పతనాన్ని శాసించగా, రంగసింఘే రెండు వికెట్లు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక మహిళలు రెండు వికెట్లు కోల్పోయి 4.3 ఓవర్లలో విజయం సాధించారు. ఓపెనర్లు యశోదా మెండిస్(4), జయాంగని(1)లు అవుట్ కాగా, కెప్టెన్ హసిని పెరీరా(17 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేసింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో థాయ్ లాండ్ మహిళలు 53 పరుగులకే కుప్పకూలారు. బంగ్లా విసిరిన 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థాయ్ లాండ్ పోరాడకుండానే 18.3 ఓవర్లలో చేతులెత్తేసింది. -
భారత్ వైట్‌వాష్
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు ట్వంటీల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అయ్యింది. మంగళవారం ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మూడో టీ 20లో భారత మహిళలు 15 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. దాంతో మూడు టీ 20ల సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో విండీస్‌కు అప్పగించింది. విండీస్ విసిరిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత మహిళలు చతికిలబడ్డారు.భారత్ 20.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి పరాజయం చెందింది. భారత్ ఆదిలోనే ఓపెనర్ వెల్లా వనిత వికెట్ ను స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే కోల్పోయింది.అనంతరం ఫస్ట్ డౌన్ క్రీడాకారిణి మందనా(6), మేఘనా సింగ్(19)లు కూడా నిష్ర్కమించడంతో భారత్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో వేదా కృష్ణమూర్తి(31 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(60 నాటౌట్)లు పోరాడినా భారత్‌ను గెలిపించలేకపోయారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్లు హేలే మాథ్యూస్(47), స్టెఫానీ టేలర్(44) మంచి ఆరంభాన్నిచ్చారు.తొలి వికెట్ కు 61పరుగులు భాగస్వామ్యం చేసి విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తో విండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. -
సిరీస్ కోల్పోయిన భారత్
మూలపాడు(విజయవాడ):మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత మహిళలు పరాజయం చెంది సిరీస్‌ను కోల్పోయారు. విండీస్ విసిరిన 138 పరుగుల లక్ష్యానికి ఛేదించే క్రమంలో భారత మహిళలు 18.1 ఓవర్లలో 106 పరుగులకే పరిమితమై ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఇంకా మ్యాచ్ ఉండగానే సిరీస్ ను చేజార్చుకుంది. భారత జట్టు లో హర్మన్ ప్రీత్ కౌర్(43),దీప్తి శర్మ(24) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ను హర్మన్ ప్రీత్ ఆదుకునే ప్రయత్నం చేసే చేసింది. అయితే మిగతా క్రీడాకారిణులు నుంచి సహకారం లభించలేదు. ఎనిమిది మంది భారత క్రీడాకారిణులు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత్ ఓటమి చెందింది. విండీస్ బౌలర్లలో డాటిన్, అనీసాలు తలో మూడు వికెట్లు తీసి భారత జట్టును కట్టడి చేయగా, మాథ్యూస్ కు రెండు వికెట్లు లభించాయి.అంగ్విల్లెరియా,క్వింటైన్లకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. విండీస్ క్రీడాకారిణుల్లో స్టెఫానీ టేలర్(47), డాటిన్(35),అంగ్వెల్లిరియా(21), మాథ్యూస్(27)లు రాణించి ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించి పెట్టారు. తొలి ట్వంటీ 20 ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
తొలి టీ 20లో భారత్ ఓటమి
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ 20లో భారత మహిళలు ఓటమి పాలయ్యారు. భారత విసిరిన 151 పరుగుల లక్ష్యాన్నివిండీస్ ఐదు వికెట్లతో తేడాతో ఛేదించింది. విండీస్ కెప్టెన్ స్టెఫనీ టేలర్(90;51 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద మాథ్యూస్(18) వికెట్ ను కోల్పోయినా, టేలర్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన టేలర్.. విండీస్ విజయాన్ని దాదాపు ఖరారు చేసిన తరువాత పెవిలియన్ చేరింది. ఇక ఆ తరువాత విండీస్ వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేశారు. వేదా కృష్ణమూర్తి(50),హర్మన్ ప్రీత్ కౌర్(68 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించారు. -
'క్రికెట్ అనేది డ్రామాలా తయారైంది'
క్రిస్ట్‌చర్చ్:ఇటీవల కాలంలో క్రికెట్ మ్యాచ్‌లు విపరీతంగా పెరిగిపోవడాన్ని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తీవ్రంగా తప్పుబట్టాడు. క్రికెట్ అనే క్రీడ టెలివిజన్‌లో నిరంతరం ప్రసారమయ్యే డ్రామా మాదిరిగా తయారైందని విమర్శించాడు. ఈ తరహా పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదని ఫ్లెమింగ్ తెలిపాడు. క్రికెట్ అనేది ఒక వినోదాత్మకమైన క్రీడ, అది అదే స్థాయిలో ఉండాలి కానీ లెక్కకు మించి మ్యాచ్‌లు జరపడం ఆ గేమ్‌లో మజాను ఘోరంగా దెబ్బతీస్తుందన్నాడు. మరొకవైపు టీ 20 లీగ్‌లు కూడా మరింత పెరగడంపై ఫ్లెమింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో క్రికెటర్లు ఆడటానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు కానీ, తాము ఈ గేమ్ ఆడం అని చెప్పడం లేదన్నాడు. అందుకు కారణం ఇక్కడ డబ్బు వారిపై తీవ్ర ప్రభావం చూపడమేనన్నాడు. ఈ తరహా గేమ్‌తో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికి దీనికి సరైన పరిష్కారం లేకపోయినా, రాబోవు రోజుల్లో మ్యాచ్‌ల నిర్వహణ తగ్గితేనే ఆ క్రీడను కాపాడటానికి ఆస్కారం ఉందన్నాడు. -
మహిళా టి20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 కెప్టెన్‌గా మిథాలీ రాజ్ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను నియమించారు. విండీస్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్, ఆసియాకప్ టి20 టోర్నీల కోసం మహిళా జట్లను ప్రకటించారు. వెస్టిండీస్‌తో వచ్చే నెల 18 నుంచి జరిగే టి20 సిరీస్‌తో పాటు నవంబర్ 27 నుంచి థాయ్‌లాండ్‌లో ప్రారంభమయ్యే ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌కు హర్మన్‌ప్రీత్ సారథిగా వ్యవహరిస్తుంది. అయితే వచ్చే నెల 10 నుంచి 16 వరకు వెస్టిండీస్‌తోనే జరిగే మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం మిథాలీ రాజ్ కెప్టెన్‌గా కొనసాగుతుంది. మ్యాచ్‌లన్నీ విజయవాడ సమీపంలోని మూలపాడులో జరుగుతాయి. -
డారెన్ స్యామీ ఆవేదన
సెయింట్ జాన్స్(ఆంటిగ్వా): వెస్టిండీస్‌కు రెండు టీ 20 వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్ డారెన్ స్యామీ. అయితే స్యామీని టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ వెస్టిండీస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ అకౌంట్లో అభిమానులకు తెలియజేసిన స్వామీ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం సెలక్టర్లు తనతో 30 సెకెండ్లపాటు మాత్రమే మాట్లాడి కెప్టెన్సీ తొలిగిస్తున్నట్లు చెప్పడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. 'శుక్రవారం సెలక్టర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశ ఏంటంటే నన్ను కెప్టెన్సీ తప్పిస్తున్నట్లు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆ విషయాన్ని కూడా 30 సెకెండ్లలోముగించి కాల్ కట్ చేశారు. మా బోర్డు ఇలా చేయడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. టీ 20 కెప్టెన్సీ నియమాకానికి కొత్త వ్యక్తి అన్వేషణలో ఉన్నట్లు మా సెలక్షన్ చైర్మన్ పేర్కొన్నారు. విండీస్ సెలక్టర్లను నా ఆట ఆకట్టుకోలేదట. ఈ కారణం చేతనే కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు చెప్పారు. ఇక విండీస్ కు టీ 20 కెప్టెన్ గా ఎంపిక కాలేనేమో' అని స్యామీ ఆందోళన వ్యక్తం చేశాడు. -
యూఎస్‌లో రెండు టీ 20లు..
ముంబై: అమెరికాలో క్రికెట్ పై ఆదరణను మరింత పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. యూఎస్‌లో రెండు అంతర్జాతీయ టీ 20లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినట్టు బీసీసీఐ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రావార్డ్ రీజినల్ పార్క్‌లో వెస్టిండీస్-భారత్ క్రికెట్ జట్ల మధ్య రెండు టీ 20లను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో క్రికెట్‌కు ప్రజాదరణ మెండుగా ఉండటంతో అక్కడ మ్యాచ్‌లు జరపడానికి నిశ్చయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. యూఎస్ లో టీ 20 చాంపియన్ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు నిర్వహించే ప్రకటనను వెల్లడించడం చాలా సంతోషంగా ఉందని అనురాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'అమెరికాలో ఉన్న క్రికెట్ అభిమానులకు అక్కడే మ్యాచ్‌లను స్వయంగా వీక్షించే అవకాశం రావడం నిజంగా గొప్ప అవకాశం. యూఎస్‌లో మరిన్ని వార్షిక క్రికెట్ ఈవెంట్స్ జరగడానికి ఈ రెండు మ్యాచ్ ల సిరీస్ కచ్చితంగా దోహదం చేస్తుంది' అని అనురాగ్ తెలిపారు. మరోవైపు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే మాట్లాడుతూ.. ప్రపంచంలో అభిమానులకు ఈ గేమ్‌ను మరింత చేరువగా చేర్చడమే తమ ఉద్దేశమన్నారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తరువాత యూఎస్‌లో క్రికెట్ మ్యాచ్‌లను జరపడానికి సిద్దమైనట్లు షిర్కే పేర్కొన్నారు. -
టీమిండియా ఎలా రిలాక్స్ అయ్యిందంటే..
హరారే: జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా ఆ తరువాత తొలి టీ 20లో మాత్రం అన్యూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో ఒక్కసారిగా టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆ పరాజయం యువ ఆటగాళ్లని తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న యువ జట్టు రెండో టీ 20లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టింది. జింబాబ్వేపై సమష్టిగా పోరాడి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తొలి టీ 20 ఓటమి తరువాత లభించిన ఈ ఘన విజయానికి హాలీవుడ్ మూవీనే కారణమట. ఆ సినిమాతో లభించిన రిలాక్స్తోనే రెండో టీ 20లో పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించామని ఓపెనర్ మన్ దీప్ సింగ్ అంటున్నాడు. 'తొలి టీ 20 తరువాత చాలా ఒత్తిడికి గురయ్యాం. ఆ ఓటమి షాక్ నుంచి ముందు బయటపడాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే అదే పిచ్ పై చాలా మ్యాచ్ లు ఆడినా మొదటి టీ 20లో విజయానికి దగ్గరకొచ్చి ఓడిపోయాం. ఆ ఓటమిపై కొన్ని కీలక విషయాలు చర్చించిన తరువాత హాలీవుడ్ మూవీ 'నౌ యూ సీ మీ-2'సినిమాకు వెళ్లాం. ఆ సినిమాను ధోనితో పాటు కొంతమంది క్రికెటర్లు కలిసి వీక్షించాం. అదే తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాకు ఉపశమనం కల్గించింది' అని అరంగేట్రం టీ 20లో హాఫ్ సెంచరీ సాధించిన మన్ దీప్ సింగ్ స్సష్టం చేశాడు. -
అదరగొట్టిన ధోని సేన
హరారే:మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా సోమవారం ఇక్కడ హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించిన టీమిండియా సునాయాస విజయాన్ని చేజిక్కించుకుంది. తొలి టీ 20లో రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైన ధోని సేన.. ఈ మ్యాచ్‌లో మాత్రం 10 వికెట్ల తేడాతో గెలిచి అందకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. జింబాబ్వే విసిరిన 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 13.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో సిరీస్‌ను 1-1 సమం చేసింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(47 నాటౌట్; 40 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్లు), మన్ దీప్ సింగ్(52 నాటౌట్;40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో భారత్ అలవోకగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జింబాబ్వే ఆది నుంచి భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. భారత యువ పేసర్ బరిందర్ శ్రవణ్ జింబాబ్వే పతనాన్ని శాసించాడు. శ్రవణ్ నాలుగు ఓవర్లలో 10 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించాడు. జింబాబ్వే ఓపెనర్ చిబాబా(10)ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన శ్రవణ్.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు. మసకద్జా(10), సికిందర్ రాజా(1), ముతోంబోడ్జి(0)లను ఒకే ఓవర్ లో శ్రవణ్ అవుట్ చేశాడు. దీంతో జింబాబ్వే ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. కాగా, జింబాబ్వే ఆటగాడు మూర్(31) ఫర్వాలేదనిపించాడు. భారత మిగతా బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు తీయగా, కులకర్ణి, చాహల్‌లకు తలో వికెట్ దక్కింది. -
శరణ్ సరికొత్త చరిత్ర!
హరారే:భారత పేస్ బౌలర్ బరిందర్ శరణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ 20 అరంగేట్రంలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. జింబాబ్వేతో రెండో టీ 20లో నాలుగు ఓవర్లలో పది పరుగులకే నాలుగు వికెట్లు సాధించడం ద్వారా శరణ్ అరంగేట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారతీయ బౌలర్ గా నిలిచాడు. తద్వారా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరంగేట్రంలో నమోదు చేసిన రికార్డును సవరించాడు. 2009లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఓజా నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించాడు. కాగా ఆ మ్యాచ్‌లో ఓజా 21పరుగులివ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా ఓవరాల్ టీ 20 అరంగేట్రం రికార్డులో మెరుగైన గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ గా శరణ్ నిలిచాడు. అంతకుముందు 2012లో ఐర్లాండ్ తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ ఎలియస్ సన్నీ ఐదు వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో పాటు ఒకే ఓవర్లలో మూడు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా శరణ్ మరో ఘనతను సాధించాడు. 2012లో అశోక్ దిండా శ్రీలంకతో జరిగిన టీ 20లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. -
భారత్ కు స్వల్ప లక్ష్యం
హరారే: మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ సోమవారం భారత్ తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో జింబాబ్వే 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆది నుంచి భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. బరిందర్ శ్రవణ్ జింబాబ్వే పతనాన్ని శాసించాడు. శ్రవణ్ నాలుగు ఓవర్లలో 10 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించాడు. జింబాబ్వే ఓపెనర్ చిబాబా(10)ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన శ్రవణ్.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు. మసకద్జా(10), సికిందర్ రాజా(1), ముతోంబోడ్జి(0)లను ఒకే ఓవర్ లో శ్రవణ్ అవుట్ చేశాడు. దీంతో జింబాబ్వే ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. కాగా, జింబాబ్వే ఆటగాడు మూర్(31) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో జింబాబ్వే నిర్ణీతో ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. భారత మిగతా బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు తీయగా, కులకర్ణి, చాహల్‌లకు తలో వికెట్ దక్కింది. -
శరణ్ విజృంభణ: జింబాబ్వే విలవిల
హరారే: మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ సోమవారం భారత్ తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో జింబాబ్వే విలవిల్లాడుతోంది. భారత బౌలర్ బరిందర్ శరణ్ దెబ్బకు జింబాబ్వే 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జింబాబ్వే కోల్పోయిన నాలుగు టాపార్డర్ వికెట్లుశరణ్ ఖాతాలోనే చేరడం విశేషం. గత మ్యాచ్‌కు దూరమైన శరణ్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో దుమ్మురేపుతున్నాడు. ప్రత్యేకంగా ఐదో ఓవర్ లో మూడు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డివిరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న జింబాబ్వే ఐదు ఓవర్లు ముగిసే సరికి చిబాబా(10), మసకద్జా(10), సికిందర్ రాజా(1), ముతోంబోడ్జి (0)ల వికెట్లను నష్టపోయింది. -
ధోని సేన గాడిలో పడేనా?
హరారే: మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ 20లో గెలిచిన జింబాబ్వే అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తుండగా, ధోని సేన మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. ఈ మ్యాచ్‌లో ధోని గ్యాంగ్ గెలిచిన పక్షంలో సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధిస్తే సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. గతంలో ఒక్కసారి కూడా ఏ జట్టుపైనా టి20 సిరీస్ నెగ్గని జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. భారత్‌పై తొలిసారి సిరీస్ నెగ్గాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ధోని సేన గాడిలో పడితేనా సిరీస్‌ను కాపాడుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే రెండో టీ 20 ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఆడిన ఉనాద్కట్‌కు రెండో టీ 20 తుది జట్టులో అవకాశం కల్పించలేదు. అతని స్థానంలో బరిందర్ శ్రవణ్ జట్టులోకి వచ్చాడు. భారత తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, కులకర్ణి, బూమ్రా, బరిందర్ శ్రవణ్, చాహల్ జింబాబ్వే తుది జట్టు:క్రీమర్(కెప్టెన్), చిబాబా,మసకద్జా, సికిందర్ రాజా,వాలర్,చిగుంబరా, మూర్,ముతోంబోడ్జి, మద్జివా, ముజారంబని, తిరిపానో -
ఆకట్టుకున్న జింబాబ్వే
హరారే: మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడ హరారే స్పోర్ట్స్ క్లబ్లో భారత్‌తో జరిగిన తొలి టీ 20లో జింబాబ్వే ఆకట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన జింబాబ్వే.. మొదటి టీ 20లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(20), మసకద్జా(25)లు మోస్తరుగా రాణించగా, ముతాంబామి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత సికిందర్ రాజా(20), వాలర్(30)లు ఫర్వాలేదనిపించారు. ఈ జోడీ మూడో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అయితే చిగుంబరా (55 నాటౌట్; 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, రిషి ధవన్, అక్షర్ పటేల్, చాహల్ లకు తలోవికెట్ దక్కింది. -
టీమిండియాలో కొత్త ముఖాలు!
హరారే: మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న ధోని సేన.. టీ 20 సిరీస్ ద్వారా మరికొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. జింబాబ్వేతో వన్డే సిరీస్ ద్వారా కేఎల్ రాహుల్ అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. మొదటి అంతర్జాతీయ టీ 20 ఆడబోతున్నాడు. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని మన్దీప్ సింగ్, ఉనాద్కట్లకు తాజా టీ 20 తుది జట్టులో అవకాశం కల్పించారు. దీంతో పాటు బౌలర్ రిషి ధవన్ కూడా తొలి టీ 20కి సిద్ధమయ్యాడు. మరోవైపు ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటుకున్న యజ్వేంద్ర చాహల్ కూడా పొట్టి ఫార్మాట్లో చోటు కల్పించారు. దీంతో ఐదుగురు భారత యువ ఆటగాళ్లు ఒకేసారి టీ 20లో అరంగేట్రం చేయబోతున్నారు. భారత తుది జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, రిషి ధవన్, బూమ్రా, ఉనాద్కట్, చాహల్ జింబాబ్వే తుది జట్టు: క్రీమర్(కెప్టెన్), చిబాబా, మసకద్జా, సికిందర్ రాజా, వాలర్, చిగుంబరా, ముతుంబామి, ముతోంబోడ్జి, మాద్జివా, ముజారాబాని, తిరిపానో -
షేన్ వార్న్ టీ 20 జట్టులో కోహ్లి!
మెల్బోర్న్:ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తన కలల వరల్డ్ టీ 20 క్రికెట్ జట్టును తాజాగా ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి స్థానం కల్పించాడు. ఓపెనర్లగా క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్‌లకు ఎంపిక చేయగా, ఫస్ట్ డౌన్‌కు విరాట్ కోహ్లిని, సెకెండ్ డౌన్‌కు ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా షేన్ వాట్సన్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రేవో, జాస్ బట్లర్, మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, ఫిజ్లను ఎంపిక చేశాడు. అయితే వార్న్ తన కలల జట్టులో ఆస్ట్రేలియా టీ 20 స్పెషలిస్టు అరోన్ ఫించ్ తో పాటు, డేవిడ్ వార్నర్, మార్టిన్ గప్టిల్ ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. గత కొంతకాలం నుంచి వార్న్ కలల జట్టును ఎంపిక చేస్తూ క్రికెట్ పై ప్రేమను ఈ రకంగా చాటుకోవడం అలవాటు. గతేడాది డిసెంబర్ లో వార్న్ తన కలల టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
టీమిండియా లక్ష్యం 121
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో బంగ్లాదేశ్ 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(13), సౌమ్య సర్కార్(14)లు నిరాశపరచగా, షకిబుల్ హసన్(21) మోస్తరుగా రాణించాడు. షకిబుల్ మూడో వికెట్ గా పెవిలియన్‌కు చేరే సరికి బంగ్లాదేశ్ స్కోరు 64 పరుగులు. అటు తరువాత బంగ్లాదేశ్ స్వల్ప వ్యవధిలో ముష్ఫికర్ రహీమ్(4), మోర్తజా(0) వికెట్లను నష్టపోయింది. కాగా, ఆ తరుణంలో షబ్బిర్ రెహ్మాన్(32 నాటౌట్) , మహ్మదుల్లా(33 నాటౌట్)లు దూకుడుగా ఆడారు. ఈ జోడి ప్రత్యేకంగా హార్దిక్ పాండ్యా వేసిన 14. 0 ఓవర్లో 21 పరుగులను పిండుకోవడంతో బంగ్లాదేశ్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. అయితే చివరి ఓవర్లో బూమ్రా ఏడు పరుగులను మాత్రమే ఇవ్వడంతో బంగ్లాదేశ్ 15.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా, అశ్విన్, బూమ్రా, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్‌ను అనుకున్న సమయానికి నిర్వహించడం సాధ్యపడలేదు. కాగా, రాత్రి గం.8.30ని.లకు పిచ్‌ను, అవుట్ ఫీల్డ్ ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ను 15.0 ఓవర్లపాటు జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
ఉత్కంఠపోరులో ఆసీస్ గెలుపు
జోహన్సెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో ట్వంటీ 20 లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆసీస్ చివరి బంతి వరకూ పోరాడి విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 205 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరోన్ ఫించ్(2), వాట్సన్(9), స్టీవ్ స్మిత్(19)లు నిరాశపరిచారు. కాగా డేవిడ్ వార్నర్(77;40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్(75; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు దూకుడుగా ఆడటంతో ఆసీస్ విజయం వైపు పరుగులు తీసింది. ఈ జోడీ నాల్గో వికెట్ కు 161 పరుగులు నమోదు చేసింది. అయితే ఈ ఇద్దరూ ఒక పరుగు వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో ఆసీస్ 194 పరుగులకు ఐదు వికెట్లను నష్టపోయింది. దీంతో చివరి ఓవర్లలో ఆసీస్ విజయానికి 11 పరుగుల అవరమయ్యాయి. ఆ సమయంలో ఫాల్కనర్(7 నాటౌట్), మిచెల్ మార్ష్(2 నాటౌట్) అజేయంగా క్రీజ్‌లో నిలబడి ఆసీస్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయంతో మూడు టీ 20ల సిరీస్ 1-1 తో సమం అయ్యింది. తొలి టీ 20లో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. ఓపెనర్ డీ కాక్ దూకుడుకు తోడు, కెప్టెన్ డు ప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సఫారీలు భారీ ఇన్నింగ్స్ నమోదు చేశారు. డీ కాక్ 28 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో ఇన్నింగ్స్ కు చక్కటి పునాది వేయగా, డు ప్లెసిస్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. ఓపెనర్ ఏబీ డివిలియర్స్(13) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా, డీకాక్, డుప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించింది. ఈ జోడీ 65 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం డీ కాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు.ఆపై గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్(33 ;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనదైన శైలిలో ఆడి జట్టు భారీ స్కోరులో సహకరించాడు. -
బంగ్లాతో తుదిపోరు:ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇక్కడ ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న తుదిపోరులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్‌ను అనుకున్న సమయానికి నిర్వహించడం సాధ్యపడలేదు. కాగా, రాత్రి గం.8.30ని.లకు అంపైర్లు పిచ్‌ను, అవుట్ ఫీల్డ్ ను పరిశీలించిన అనంతరం మ్యాచ్ జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మ్యాచ్ ను 15.0 ఓవర్లకు కుదించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఓటమి ఎరుగకుండా ఫైనల్ కు చేరిన ధోని సేన ట్రోఫీతో స్వదేశాని పయనం కావాలని భావిస్తుండగా, మరోవైపు రోవైపు యువకులతో నిండిన బంగ్లాదేశ్ సమష్టిగా పోరాడి కప్ ను సాధించాలనే యోచనతో ఉంది. ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. -
డు ప్లెసిస్ మెరుపులు
జోహన్సెస్‌బర్గ్: మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ డీ కాక్ దూకుడుకు తోడు, కెప్టెన్ డు ప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు. డీ కాక్ 28 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో ఇన్నింగ్స్ కు చక్కటి పునాది వేయగా, డు ప్లెసిస్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడి 79 పరుగులు సాధించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఏబీ డివిలియర్స్(13) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. కాగా, ఆ తరుణంలో డీకాక్, డుప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించింది. ఈ జోడీ 65 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం డీ కాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. అయితే ఆ తరువాత వచ్చిన డుమినీ(14)స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరాడు. ఆపై గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్(33 ;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనదైన శైలిలో ఆడటంతో సఫారీల పరుగుల వేగం పెరిగింది. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. తొలి టీ 20 లో ఆసీస్‌పై దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. -
'మా జట్టులో టీ 20 స్టార్స్ లేరు'
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరగబోయే తుదిపోరులో టీమిండియానే ఫేవరెట్ అని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా అభిప్రాయపడ్డాడు. ట్రోఫీని అందుకునేందుకు అన్ని అర్హతలతో టీమిండియా బరిలోకి దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. దీనిపై ఎటువంటి చర్చ అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కాగా, స్వదేశీ పరిస్థితులు తమకు కలిసొచ్చే అవకాశం లేకపోలేదని ఆశాభావాన్ని మోర్తజా వ్యక్తం చేశాడు. యువకులతో కూడిన తమ జట్టు సమష్టి ప్రదర్శనతోనే విజయాలను సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించిందన్నాడు. 'మా జట్టులో టీ 20 స్టార్ అంటూ ఎవరూ లేరు. మ్యాచ్ విన్నర్స్ అంతకన్నా లేరు. వాతావరణం, పిచ్, స్వదేశీ పరిస్థితులు మాత్రమే మాకు అనుకూలంగా ఉన్నాయి. ఫైనల్లో గెలవడానికి మా శాయశక్తులా పోరాడుతాం' అని మోర్తజా పేర్కొన్నాడు. తమకు ఫైనల్ కూడా ఒక మ్యాచ్ వంటిదే అన్న టీమిండియా డైరెక్టర్ వ్యాఖ్యలతో మోర్తజా ఏకీభవించాడు. అంతకుముందు 10 మ్యాచ్‌లు వారు ఎలా ఆడారో అదే విధంగా ఈ మ్యాచ్ ఆడతారన్నాడు. కాగా, టీమిండియా ఆడే ఫైనల్ మ్యాచ్‌ల్లో ఆ జట్టే ఎక్కువ హైప్ స్పష్టిస్తూ ఉంటుందని మోర్తజా తెలిపాడు. కాగా, తమ జట్టుపై మాత్రం ఎటువంటి ఒత్తిడి లేదని, సహజసిద్ధంగానే రేపటి పోరుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. -
ఆసీస్‌కు షాక్
డర్బన్: దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆసీస్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఛేదించిన దక్షిణాఫ్రికా సిరీస్ లో బోణి కొట్టింది. కెప్టెన్ డు ప్లెసిస్(40; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడటంతో పాటు డేవిడ్ మిల్లర్(53 నాటౌట్;35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్(40), మిచెల్ మార్ష్(35), డేవిడ్ వార్నర్(20)లు మినహా ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ మూడు వికెట్లు సాధించగా, రబడా,వైజ్లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
లంకపై పాక్ గెలుపు
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు ఉండగానే పాక్ లక్ష్యాన్ని ఛేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ షార్జిల్ ఖాన్(24 బంతుల్లో 31), సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 38), ఊమర్ అక్మల్(48: 4 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో పాక్ తన చివరి మ్యాచ్ లో గెలుపొందింది. ఊమర్ అక్మల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, ఈ జట్లు ఇప్పటికే ఇంటి దారి పట్టాయి. మార్చి 6న జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్, భారత్ తలపడనున్నాయి. లంక బౌలర్లలో కులశేఖర, జయసూర్య, దిల్షాన్, సిరివర్ధనే తలో వికెట్ తీశారు. ఓపెనర్లు చండిమాల్(58; 49 బంతుల్లో 7ఫోర్లు,1 సిక్స్), దిల్షాన్(75;56 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో తొలిసారి ఆకట్టుకున్న దిల్షాన్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఒకవైపు తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూనే చివరి వరకూ క్రీజ్‌లో నిలిచి బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడాడు. -
పాకిస్తాన్ విజయలక్ష్యం 151
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు శుభారంభం లభించింది. ఓపెనర్లు చండిమాల్(58; 49 బంతుల్లో 7ఫోర్లు,1 సిక్స్), దిల్షాన్(75;56 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. అయితే జట్టు స్కోరు 110 పరుగుల వద్ద చండిమాల్ వికెట్ ను కోల్పోయిన లంకేయులు.. మరో ఏడు పరుగుల వ్యవధిలో జయసూరియా(4)ను రెండో వికెట్ నష్టపోయారు. అనంతరం కపుగదెరా(2), షనకా(0) వికెట్లను లంక వెనువెంటనే కోల్పోయింది. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో తొలిసారి ఆకట్టుకున్న దిల్షాన్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఒకవైపు తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూనే చివరి వరకూ క్రీజ్‌లో నిలిచి బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లంక నిర్ణీత ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. -
'అవసరమైతే పారామిలటరీ బలగాలు'
న్యూఢిల్లీ:వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన ధర్మశాలలో జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి హిమచల్ రాష్ట్ర ప్రభుత్వం తమను భద్రతను కోరిన పక్షంలో పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మ్యాచ్ నిర్వహణపై తాము భద్రత కల్పించాలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం వివరణ ఇచ్చారు. తమ సాయాన్ని కోరితే కచ్చితంగా పారామిలటరీ ఫోర్స్‌ను పంపుతామని పేర్కొన్నారు. ఇది కేవలం వీరభద్రసింగ్ నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉంటుందని రాజ్ నాథ్ తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ మిలిటెంట్ మసూద్ అజహర్ తలను భారత్‌కు అప్పగించాలంటూ మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ మంత్రి మేజర్ విజయ్ సింగ్ మంకోతియా నిరసన గళం వినిపించడంతో ఆ మ్యాచ్ నిర్వహణ మరింత సందిగ్థంలో పడింది. కాగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)బెదిరింపులకు దిగింది. ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్ ఆడనుందని భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, లేదంటే తాము మెగాటోర్నీ నుంచి తప్పుకొంటామంటోంది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి ట్వంటీ 20 లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్‌కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. కాగా, ఇటీవల కాలంలో శ్రీలంక-పాకిస్తాన్‌లు పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో కనీసం విజయం సాధించి కాస్త పరువు దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఆసియాకప్‌లో రెండు జట్లు పసికూన యూఏఈపై మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఎవరితోనైనా.. ఎక్కడైనా: ధోని
మిర్పూర్:ట్వంటీ 20 ఫార్మాట్లో తమ జట్టు అత్యంత నిలకడగా ఉందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రపంచంలో ఎక్కడైనా ఏ జట్టుతోనైనా కచ్చితమైన పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20ల్లో టీమిండియా సమతుల్యంగా కనబడుతుందన్నాడు. 'మా జట్టును చూడండి. ఇలా ఉండటం తరచుగా జరగొచ్చు. ఈ ఏడాది మేము ఆడిన 10 టీ 20ల్లో తొమ్మిది గెలిచాం. పలు దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడాం. నేను కేవలం చెబుతున్నది టీ 20 ఫార్మెట్ గురించి మాత్రమే, వన్డేల గురించి కాదు. మా జట్టులో ముగ్గురు యోగ్యమైన సీమర్లు ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లు, పార్ట్ టైమర్లు కూడా ఉన్నారు. ఎనిమిదో స్థానం వరకూ మా బ్యాటింగ్ పై భరోసా ఏర్పడింది. దాంతో మ్యాచ్ చివర్లో కొన్ని విలువైన పరుగులు కూడా జట్టుకు అదనంగా చేకూరుతాయి.ఇదే సరైన కాంబినేషన్ అనుకుంటున్నా' అని యూఏఈతో మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం ధోని జట్టుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో చివరి, ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పోటీ కచ్చితంగా ఉంటుందన్నాడు. ఏ జట్టుకైనా స్వదేశీ పరిస్థితులు బాగా తెలియడం వల్ల బంగ్లాతో పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు. -
రప్ఫాడించిన ధోని సేన
మిర్పూర్:ధనాధన్ క్రికెట్లో తమదైన ముద్ర చూపిస్తూ చెలరేగిపోతున్న టీమిండియా మరోసారి అదుర్స్ అనిపించింది. తొలుత బౌలింగ్‌తో యూఏఈను బెదరగొట్టి.. అటు తరువాత బ్యాటింగ్‌లో అదరగొట్టింది. తద్వారా ఆసియాకప్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల విజయాన్ని సాధించింది. యూఏఈ విసిరిన 82 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(39; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తనదైన మార్కును చూపిస్తూ దూకుడుగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్(16 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు), యువరాజ్ సింగ్(25; 14 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్))లు మరో వికెట్ పడకుండా 39 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా 10.1 ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆది నుంచి బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడింది. పటిష్టమైన భారత బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(43) మినహా ఎవరూ రాణించలేదు. అన్వర్ తరువాత రోహన్ ముస్తఫా(11)ది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దీంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 81 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్లు లభించగా, బూమ్రా, పాండ్యా, హర్భజన్ సింగ్, నేగీ, యువరాజ్లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ విశేషాలు.. *యువరాజ్ సింగ్ కు ఇది 50వ ట్వంటీ 20 మ్యాచ్. అంతకుముందు భారత్ తరపున ధోని, రైనా, రోహిత్ శర్మలు ఈ ఘనతను అందుకున్నారు. * పవర్ ప్లేలో యూఏఈ 21 పరుగులు మాత్రమే చేయడంతో జింబాబ్వే సరసన చేరింది. 2010లో జింబాబ్వే పవర్ ప్లేలో 21 పరుగులనే నమోదు చేసింది. *ట్వంటీ 20ల్లో తొలి పరుగును సాధించడానికి యూఏఈకు అవసరమైన బంతులు 11. అంతకుముందు 2010 లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే మొదటి పరుగును చేయడానికి 21 బంతులను ఆడటం గమనార్హం. -
టీమిండియాకు స్వల్ప లక్ష్యం
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో యూఏఈ 82 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆది నుంచి బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడింది. పటిష్టమైన భారత బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(43) మినహా ఎవరూ రాణించలేదు. అన్వర్ తరువాత రోహన్ ముస్తఫా(11)ది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దీంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 81 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్లు లభించగా, బూమ్రా, పాండ్యా,హర్భజన్ సింగ్, నేగీ, యువరాజ్లకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ పవన్ నేగీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా, చాలాకాలం నుంచి జట్టుతో పాటే ఉన్న హర్భజన్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు భువనేశ్వర్ కుమార్ కు చోటు కల్పించారు. వీరి రాకతో గత మ్యాచ్ ల్లో ఆడిన రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా, మూడు మ్యాచ్‌లు ఓడిన యూఏఈ నిష్ర్కమించింది. దాంతో టోర్నీపరంగా ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కాగా, భారత్, యూఏఈ మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం. -
పది ఓవర్లలో యూఏఈ స్కోరు 32/3
మిర్పూర్: ఆసియాకప్‌లో భారత్‌తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో యూఏఈ పది ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 32 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(17), మొహ్మద్ ఉస్మాన్(6)లు క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు స్వప్నిల్ పాటిల్(1), మహ్మద్ షహజాద్(0), రోహన్ ముస్తఫా(11)లు పెవిలియన్ కు చేరారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. -
5 ఓవర్లు..14 పరుగులు.. 2 వికెట్లు
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా ఇక్కడ గురువారం టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు ట్వంటీ 20 మ్యాచ్‌లో యూఏఈ ఐదు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. యూఏఈ ఆటగాళ్లలో స్వప్నిల్ పాటిల్ (1), మహ్మద్ షహజాద్(0)లు పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ..భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. యూఏఈ కోల్పోయిన తొలి రెండు వికెట్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది. భారత క్రికెట్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ద్వారా పవన్ నేగీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. మరోవైపు చాలాకాలం నుంచి జట్టుతో పాటే ఉన్న హర్భజన్ సింగ్ తుది జట్టులోకి రాగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ కు చోటు కల్పించారు. వీరి రాకతో గత మ్యాచ్ ల్లో ఆడిన రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు. -
పవన్ నేగీ అరంగేట్రం
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా గురువారం ఇక్కడ యూఏఈతో తలపడుతున్న భారత క్రికెట్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ద్వారా పవన్ నేగీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. మరోవైపు చాలాకాలం నుంచి జట్టుతో పాటే ఉన్న హర్భజన్ సింగ్ తుది జట్టులోకి రాగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ కు చోటు కల్పించారు. వీరి రాకతో గత మ్యాచ్ ల్లో ఆడిన రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించకతప్పలేదు. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా, మూడు మ్యాచ్‌లు ఓడిన యూఏఈ నిష్ర్కమించింది. దాంతో టోర్నీపరంగా ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కాగా, భారత్, యూఏఈ మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం. టాస్ గెలిచిన యూఏఈ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఎదురే లేదు
ప్రపంచకప్‌కు సన్నాహకం అంటే ఇంత గొప్పగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ మ్యాచ్‌కూ పదునెక్కుతున్న భారత జట్టు తమ అద్భుత ప్రదర్శనతో మరో ‘ఆసియా’ జట్టును పడగొట్టింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఇప్పటికే చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు శ్రీలంకను కూడా కుప్పకూల్చింది. ప్రత్యర్థి మారినా, పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆధిపత్యంలో మాత్రం తేడా రాలేదు. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్... ప్రత్యర్థి జట్టులో ఒక్క బ్యాట్స్‌మన్‌కు కూడా దూకుడుగా ఆడే అవకాశం ఇవ్వకుండా మన బౌలర్లు చెలరేగడం... ఆపై ఎప్పటిలాగే కోహ్లి బాధ్యతాయుత బ్యాటింగ్... చాలాకాలం తర్వాత యువరాజ్ బ్యాట్నుంచి జాలువారిన భారీ సిక్సర్లు... వెరసి మన జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ధోనిసేన ఫైనల్లోకి అడుగు పెట్టేసింది. ♦ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ♦ వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం ♦ 5 వికెట్లతో శ్రీలంక చిత్తు ♦ రేపు యూఏఈతో ధోనిసేన చివరి మ్యాచ్ మిర్పూర్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కపుగెదెర (32 బంతుల్లో 30; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పాండ్యా, అశ్విన్, బుమ్రా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) మరో సారి అర్ధ సెంచరీతో సత్తా చాటగా, యువరాజ్ సింగ్ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి, యువరాజ్ నాలుగో వికెట్‌కు 34 బంతుల్లోనే వేగంగా 51 పరుగులు జత చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశారు. వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గిన ధోని సేన ఫైనల్‌కు అర్హత సాధించింది. తాజా ఫలితంతో లంక ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. గురువారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ జట్టు యూఏఈతో తలపడుతుంది.ఆదుకున్న కపుగెదెర ఆసియా కప్‌లో ఆరంభంలో పేస్ బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న నెహ్రా, బుమ్రా శ్రీలంకను పూర్తిగా కట్టి పడేశారు. ఒక వైపు పరుగులు తీయలేక, మరో వైపు వికెట్లు చేజార్చుకొని లంక ఇబ్బందులు ఎదుర్కొంది. మూడో ఓవర్లో చండీమల్ (4)ను నెహ్రా అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే జయసూర్య (3)ను బుమ్రా వెనక్కి పంపించాడు. పవర్‌ప్లేలో ఆ జట్టు 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ వెంటనే పాండ్యా వేసిన తొలి బంతికి దిల్షాన్ (18) పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్‌లో తన చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన పాండ్యా, ఈ సారి మొదటి బంతికే వికెట్ తీయడం విశేషం. అయితే మ్యాచ్‌లు వేర్వేరు కావడంతో దీనిని హ్యాట్రిక్‌గా పరిగణించరు. ఈ దశలో పాండ్యా వేసిన మరో ఓవర్లో రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించబోయిన మ్యాథ్యూస్ (18) చివరి బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో లంక మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో కపుగెదెర, సిరివర్దన (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 31 బంతుల్లో 43 పరుగులు జోడించడంతో లంక స్కోరు 100 పరుగులు దాటింది. అయితే సిరివర్దనను అవుట్ చేసి అశ్విన్ దెబ్బ తీశాడు. అదే ఓవర్ చివరి బంతికి రోహిత్ చక్కటి ఫీల్డింగ్ కారణంగా షనక (1) రనౌట్ కాగా... నిలకడగా ఆడుతున్న కపుగెదెర, బౌండరీ వద్ద పాండ్యా అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. చివర్లో తిసార పెరీరా (6 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని భారీ షాట్లు ఆడటంతో లంక మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో లంక అత్యధికంగా 13 పరుగులు చేసింది. యువరాజ్ జోరు లక్ష్యఛేదనలో భారత్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. కులశేఖర తొలి ఓవర్లో ధావన్ (1) అవుట్ కాగా, అతని తర్వాతి ఓవర్లో రోహిత్ (14 బంతుల్లో 15; 3 ఫోర్లు) వెనుదిరిగాడు. అయితే మరోసారి కోహ్లి తన క్లాస్ ఆటతీరును ప్రదర్శించాడు. రైనా (26 బంతుల్లో 25; 2 ఫోర్లు) సహకారంతో మరోక సారి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 47 బంతుల్లో 54 పరుగులు జోడించారు. రైనా అవుటైన తర్వాత బరిలోకి దిగిన యువరాజ్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో చెలరేగాడు. రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో ఇదే ప్రత్యర్థితో అవమానకర ఇన్నింగ్స్ ఆడిన యువీ ఇప్పుడు తన అసలు ఆట ప్రదర్శించాడు. హెరాత్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, ఆ తర్వాత పెరీరా ఓవర్లోనూ మరో భారీ సిక్సర్ కొట్టాడు. యువీ ధాటికి భారత్ వేగంగా విజయం దిశగా పయనించింది. చివరి వరకు నిలిచిన కోహ్లి అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు: శ్రీలంక ఇన్నింగ్స్: చండీమల్ (సి) ధోని (బి) నెహ్రా 4; దిల్షాన్ (సి) అశ్విన్ (బి) పాండ్యా 18; జయసూర్య (సి) ధోని (బి) బుమ్రా 3; కపుగెదెర (సి) పాండ్యా (బి) బుమ్రా 30; మ్యాథ్యూస్ (బి) పాండ్యా 18; సిరివర్దన (సి) రైనా (బి) అశ్విన్ 22; షనక (రనౌట్) 1; పెరీరా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 17; కులశేఖర (రనౌట్) 13; చమీరా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-6; 2-15; 3-31; 4-57; 5-100; 6-104; 7-105; 8-125; 9-138. బౌలింగ్: నెహ్రా 4-0-23-1; బుమ్రా 4-0-27-2; పాండ్యా 4-0-26-2; యువరాజ్ 1-0-3-0; జడేజా 2-0-19-0; అశ్విన్ 4-0-26-2; రైనా 1-0-9-0. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) చండీమల్ (బి) కులశేఖర 1; రోహిత్ (సి) కపుగెదెర (బి) కులశేఖర 15; కోహ్లి (నాటౌట్) 56; రైనా (సి) కులశేఖర (బి) షనక 25; యువరాజ్ (సి) కులశేఖర (బి) పెరీరా 35; పాండ్యా (బి) హెరాత్ 2; ధోని (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-11; 2-16; 3-70; 4-121; 5-125. బౌలింగ్: మ్యాథ్యూస్ 3-0-16-0; కులశేఖర 3-0-21-2; పెరీరా 4-0-32-1; చమీరా 4-0-27-0; హెరాత్ 3.2-0-26-1; షనక 1-0-7-1; సిరివర్దన 1-0-13-0. ఆసియాకప్‌లో నేడు బంగ్లాదేశ్ X పాకిస్తాన్ రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం 13 టి20ల్లో కోహ్లి అర్ధసెంచరీల సంఖ్య. మెకల్లమ్, గేల్ల అత్యధిక అర్ధసెంచరీల రికార్డును కోహ్లి సమం చేశాడు. -
ఫైనల్‌కు చేరిన ధోని సేన
మిర్పూర్: ఆసియాకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా సమష్టి పోరాటంతో చెలరేగిపోతూ వరుస విజయాల్ని నమోదు చేస్తోంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో ధోని సేన ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 'హ్యట్రిక్' గెలుపును సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లి(56నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు), యువరాజ్ సింగ్ (35; 18 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు) రాణించి టీమిండియా విజయంలో ముఖ్య భూమిక పోషించారు. తద్వారా ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలో తడబడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(1), రోహిత్ శర్మ(15) లు కులశేఖర బౌలింగ్‌లో అవుట్ కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. కాగా, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఈ జోడి 53 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా పుంజుకుంది. అయితే జట్టు స్కోరు 70 పరుగుల వద్ద ఉండగా రైనా(25) మూడో వికెట్ గా అవుటయ్యాడు.ఆ తరుణంలో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్లు వేసిన చెత్త బంతులను బౌండరీలు దాటించి తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించాడు. భారత్ విజయానికి మరో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో యువీ భారీ షాట్‌కు యత్నించి నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా(2) వెంటనే పెవిలియన్ చేరి నిరాశపరిచినా, మిగతా పనిని విరాట్ కోహ్లి, కెప్టెన్ మహేంద్ర సింగ్(7 నాటౌట్)లు పూర్తి చేయడంతో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా నాలుగు బంతులుండగానే విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర రెండు వికెట్లు సాధించగా, పెరీరా, షనకాలు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేశారు. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద చండిమాల్(4) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరగా, 15 పరుగుల వద్ద జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు.అనంతరం దిల్షాన్(18), మాథ్యూస్(18)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కపుగదెరా(30), సిరివర్దనే(22) మోస్తరుగా రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై శ్రీలంక మరోసారి తడబడినా పెరీరా(17), కులశేఖర(13 ) సమయోచితంగా ఆడటంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులను చేసింది. భారత బౌలర్లలో బూమ్రా, పాండ్యా, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, నెహ్రాకు ఒక వికెట్ దక్కింది. మ్యాచ్ విశేషాలు.. ట్వంటీ 20ల్లో శ్రీలంకపై విరాట్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ ట్వంటీ 20ల్లో తొలుత బ్యాటింగ్ చేసి మొదటి 10 ఓవర్లలో శ్రీలంక(47) రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అంతకుముందు 2007లో సౌతాఫ్రికాపై లంక చేసిన 43 పరుగులు తొలి అత్యల్ప స్కోరు భారత్ పై తాజాగా ఇన్నింగ్స్ తో కలుపుకుని ఈ ఏడాది దిల్షాన్ ట్వంటీ 20 యావరేజ్ 12.28 గా ఉంది. టీమిండియా ఆడిన గత నాలుగు ట్వంటీ 20లకు గాను మూడింట టాస్ గెలవడం విశేషం. -
టీమిండియా ఓపెనర్లు అవుట్
మిర్పూర్:ఆసియాకప్‌లో శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ 20 పోరులో భారత్ 16 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్(1), రోహిత్ శర్మ(15)లు పెవిలియన్ చేరారు. ఈ రెండు వికెట్లను లంక బౌలర్ కులశేఖర తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేశారు. శ్రీలంక ఆదిలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా కపుగదెరా(30), సిరివర్దనే(22)లు ఆదుకున్నారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో శ్రీలంక ఫర్వాలేదనిపించింది. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద చండిమాల్(4) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరగా, 15 పరుగుల వద్ద జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు.అనంతరం దిల్షాన్(18), మాథ్యూస్(18)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత పెరీరా(17), కులశేఖర(12) సమయోచితంగా ఆడటంతో లంక తేరుకుంది. -
టీమిండియా టార్గెట్ 139
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో శ్రీలంక 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆదిలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా కపుగదెరా, సిరివర్దనేలు జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో శ్రీలంక తేరుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంకేయులు వరుస వికెట్లను కోల్పోయారు. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద చండిమాల్(4) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరగా, 15 పరుగుల వద్ద జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు.అనంతరం దిల్షాన్(18), మాథ్యూస్(18)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కపుగదెరా(30), సిరివర్దనే(22) మోస్తరుగా రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై శ్రీలంక మరోసారి తడబడినా పెరీరా(17), కులశేఖర(13 ) సమయోచితంగా ఆడటంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా, పాండ్యా, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, నెహ్రాకు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీద ఉన్న ధోని సేన ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది. ఒకవేళ టీమిండియా గెలిస్తే ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. -
శ్రీలంక 105/7
మిర్పూర్: ఆసియాకప్‌లో భారత్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో శ్రీలంక మరోసారి తడబడింది. శ్రీలంక 105 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయారు. శ్రీలంక ఆటగాళ్లలో కపుగదెరా(30, సిరివర్దనే(22) మినహా ఎవరూ రాణించలేదు. అంతకుముందు చండిమల్(4), జయసూరియా(3) , దిల్షాన్(18), మాథ్యూస్(18)లు తీవ్రంగా నిరాశపరిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ఆశిష్ నెహ్రా, బూమ్రాలకు తలో వికెట్ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీద ఉన్న ధోని సేన ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది. ఒకవేళ టీమిండియా గెలిస్తే ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. -
శ్రీలంక తడబాటు
మిర్పూర్: ఆసియాకప్‌లో భారత్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో శ్రీలంక తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయిన లంకేయులు.. 15 పరుగుల వద్ద మరో వికెట్ ను కోల్పోయారు. శ్రీలంక ఓపెనర్ చండిమల్(4)ను మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ వచ్చిన జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, మరో ఓపెనర్ దిల్షాన్(18)ను మూడో వికెట్ గా పెవిలియన్ , మాథ్యూస్ (18) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో 11.0 ఓవర్లలో శ్రీలంక నాలుగు కీలక వికెట్లను నష్టపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ఆశిష్ నెహ్రా, బూమ్రాలకు తలో వికెట్ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీద ఉన్న ధోని సేన ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది. ఒకవేళ టీమిండియా గెలిస్తే ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. -
భారతతో టీ20: శ్రీలంక 47/3
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా భారత్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో శ్రీలంక 10 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 47పరుగులు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుంది. 31పరుగులకే మూడు వికెట్ల నష్టపోయిన తడబడిన లంక ఇన్నింగ్స్ కు మాథ్యూస్, కపుగదెరాలు మరమ్మత్తులు చేపట్టారు. చండిమల్(4), జయసూరియా(3) , దిల్షాన్(18)లు పెవిలియన్ కు చేరారు. -
టాస్ గెలిచిన టీమిండియా
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న ధోని సేన హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓటమి పాలైన లంకేయులు తీవ్ర ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమయ్యారు. అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో శ్రీలంక కంటే మెరుగ్గా ఉన్న టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గత పాకిస్తాన్ మ్యాచ్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య తొమ్మిది ట్వంటీ 20 మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ ఐదింట గెలవగా, లంకేయులు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచారు. -
పాక్ బోణీ:7 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపు
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల గెలుపుతో బోణీ కొట్టింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 18.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్(50; 46 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) 8వ టీ20 హాఫ్ సెంచరీ చేశాడు. షోయబ్ మాలిక్ (63; 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) ఫోర్ కొట్టి పాక్ కు గెలుపునందించాడు. మాలిక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. యూఏఈ బౌలర్లలో అంజాద్ మాత్రమే రాణించి మూడు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. పాక్ ను హడలెత్తించాడు యూఏఈ బౌలర్ అంజాద్ జావేద్ పాక్ టాపార్డన్ కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి పాక్ ఓపెనర్ షార్జిల్ ఖాన్(4) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్ ఐదో బంతికి ఖుర్రం మంజూర్(0)ను వెనక్కి పంపాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే కీపర్ క్యాచ్ ఇచ్చి మంజూర్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మరోసారి పాక్ ను దెబ్బకొట్టాడు. నాలుగో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ మహమ్మద్ హఫీజ్(11)ను కూడా త్వరగానే ఇంటిదారి పట్టించి పాక్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో పాక్ 17 పరుగులకే ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్ మన్స్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిగతా బౌలర్ల నుంచి సహకారం లేకపోవడంతో మాలిక్, ఉమర్ అక్మల్ లు నాలుగో వికెట్ కు 114 పరుగుల భారీ భాగస్వాయ్యాన్ని నెలకొల్పారు. టీ20 లలో నాలుగో వికెట్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆదిలో తడబడినా తరువాత పుంజుకుంది. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో షైమాన్ అన్వర్(46;42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ముహ్మాద్ ఉస్మాన్(21),అమ్ జాద్ జావెద్ (27 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో యూఏఈ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆమిర్, ఇర్ఫాన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, ఆఫ్రిది, సమీలకు చెరో వికెట్ దక్కింది. మంగళవారం భారత్, శ్రీలంకలు తలపడతున్నాయి. -
పాకిస్తాన్ విజయలక్ష్యం 130
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో యూఏఈ 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆదిలో తడబడినా తరువాత పుంజుకుంది. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో షైమాన్ అన్వర్(46;42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ముహ్మాద్ ఉస్మాన్(21),అమ్ జాద్ జావెద్ (27 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో యూఏఈ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆమిర్, ఇర్ఫాన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, ఆఫ్రిది, సమీలకు చెరో వికెట్ దక్కింది. -
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న యూఏఈ
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇంకా ఇరు జట్లు బోణి కొట్టలేదు. భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలవ్వగా, బంగ్లాదేశ్ , శ్రీలంకలపై యూఏఈ పరాజయం చెందింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే అటు బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న పాకిస్తాన్.. బ్యాటింగ్‌పై దృష్టి సారించాల్సి ఉంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ ఒక్క ఆటగాడు ఆకట్టుకోలేకపోవడం పాకిస్తాన్ జట్టులో కాస్త ఆందోళన నెలకొంది. -
టీమిండియా ఘన విజయం
-
టీమిండియాదే గెలుపు
మిర్పూర్: ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ విసిరిన పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ధోని సేన చెమటోడ్చి ఛేదించింది . అటు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్‌లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ మరుపురాని విజయాన్ని అందుకుంది. ట్వంటీ 20ల్లో పాక్‌పై ఉన్న రికార్డును మరింత మెరుగుపరుచుకున్న భారత్.. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. భారత్ విజయలక్ష్యం 84. ఇక ధోని సేన విజయం నల్లేరు నడకే అనుకున్నారు అంతా. అయితే ఎనిమిది పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు డకౌట్‌గా పెవిలియన్ కు చేరగా, సురేష్ రైనా(1) వెంటనే అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ పాకిస్తాన్ పై మొగ్గింది. ఆ తరుణంలో విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్‌లు పాకిస్తాన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు. విరాట్(49; 51 బంతుల్లో 7 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా, యువరాజ్ సింగ్(14 నాటౌట్; 32 బంతుల్లో 2 ఫోర్లు) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఈ జోడీ నాల్గో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా 15.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ అమిర్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, మహ్మద్ సమీకి రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 83 పరుగులకే చాపచుట్టేసింది.పాకిస్తాన్ పేకమేడలా కుప్పకూలింది. భారత్ పదునైన బౌలింగ్‌కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో పాక్ ఇంకా 15 బంతులుండగానే మూటగట్టేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ అహ్మద్(25) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజాకు రెండు, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్‌లు తలో వికెట్ సాధించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ విశేషాలు.. *భారత ట్వంటీ 20 చరిత్రలో ఓపెనర్లు డకౌట్ గా పెవిలియన్ చేరడం ఇదే తొలిసారి. అయితే పాకిస్తాన్ ప్రత్యర్థి ఓపెనర్లను సున్నా పరుగులకే అవుట్ చేయడం రెండో సారి. *ఇది పాకిస్తాన్ మూడో అత్యల్ప ట్వంటీ 20 స్కోరు. అంతకుముందు ఆస్ట్రేలియాపై 74, వెస్టిండీస్‌పై 82 పరుగులకు పాక్ ఆలౌటయ్యింది. *ట్వంటీ 20 ల్లో మొదటి 10 ఓవర్లలో ఆరు వికెట్లను భారత్ తొలిసారి సాధించింది. -
రెండు పరుగులు.. రెండు వికెట్లు
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్ లో భారత్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ రెండు పరుగులకే రెండు వికెట్లను నష్టపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు డకౌట్ గా పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్తాన్ విసిరిన 84 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే కష్టాలను కొనితెచ్చుకుంది. పాకిస్తాన్ మహ్మద్ అమిర్ కు తొలి రెండు వికెట్లు లభించడంతో భారత్ శిబిరంలో ఆందోళన నెలకొంది. -
పాకిస్తాన్‌ను కూల్చేశారు!
మిర్పూర్:భారత్-పాకిస్తాన్ల క్రికెట్ మ్యాచ్ అంటే సర్వత్రా ఆసక్తికరం. ఆటగాళ్లు కూడా అంచనాల మించి రాణించాలనుకుంటారు. దీంతో సుదీర్ఘ విరామం అనంతరం తలపడుతున్నఇరు జట్లు పోరు ఉత్కంఠ జరిగే అవకాశం ఉందని తొలుత అంచనా వేశారు. అయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఏమాత్రం భారత్ బౌలింగ్ ను ప్రతిఘటించలేకపోయింది. కనీసం మూడంకెల మార్కును చేరకుండానే చాపచుట్టేసింది. ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పేకమేడలా కుప్పకూలింది. భారత్ పదునైన బౌలింగ్‌కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో పాక్ ఇంకా 15 బంతులుండగానే మూటగట్టేసింది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ముందు పాకిస్తాన్ బ్యాటింగ్‌లో కట్టడి చేయాలని భావించిన ధోని అండ్ గ్యాంగ్ అందుకు తగ్గట్టునే రాణించింది. కేవలం 17.3 ఓవర్లలో 83 పరుగులకే పాక్ ను కూల్చేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ అహ్మద్(25) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజాకు రెండు, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్‌లకు తలో వికెట్ లభించింది. -
పాకిస్తాన్ పేకమేడలా..
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా భారత్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. పాకిస్తాన్ 52 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. భారత్ పదునైన బౌలింగ్‌కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ కు కలిసిరావడంతో పాక్ పేకమేడలా కూలింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లను సమర్పించుకోవడంతో భారత్ పట్టుబిగించింది. భారత్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా, బూమ్రా, పాండ్యా, యువరాజ్ సింగ్ , రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది. మరో రెండు వికెట్లను రనౌట్ రూపంలో వచ్చాయి. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. -
తొలి ఓవర్ లో వికెట్ కోల్పోయిన పాక్
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా భారత్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మహ్మద్ హఫీజ్(4)ను ఆశిష్ నెహ్రా పెవిలియన్‌కు పంపాడు. మొదటి ఓవర్లో ఫోర్ కొట్టి ఊపుమీద కనబడ్డ హఫీజ్.. నెహ్రా వేసిన నాల్గో బంతికి చిక్కాడు. నెహ్రా కొద్దిగా బౌన్స్ ను జోడించి ఆఫ్ స్టంప్ పై సంధించిన బంతి హఫీజ్ బ్యాట్‌ను ముద్దాడుతూ మహేంద్ర సింగ్ ధోని చేతుల్లోకి వెళ్లడంతో పాకిస్తాన్ ఆదిలోనే వికెట్‌ను నష్టపోయింది. దీంతో పాకిస్తాన్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోయి ఐదు పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. -
టాస్ గెలిచిన భారత్
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అటు బ్యాటింగ్‌లో బలంగా ఉన్న భారత్.. తొలుత బౌలింగ్ తీసుకుని దాయాది పాకిస్తాన్ ను కట్టడి చేయాలని భావిస్తోంది. కాగా, పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి రావడంతో స్కోరు బోర్డుపై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాలని యోచిస్తోంది. ఇప్పటికే రెండు వరుస సిరీస్‌లు గెలవడంతో పాటు, ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించిన ధోని సేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, మరోవైపు పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల చేతిలో వరుసగా రెండు టి20 సిరీస్‌లు ఓడి తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సిద్ధమైంది. భారత్, పాక్‌ల మధ్య ఇప్పటివరకూ ఆరు టి20 మ్యాచ్‌లు జరిగితే భారత్ ఐదు గెలవగా, ఒకదాంట్లో మాత్రమే పాక్ విజయం సాధించింది. -
ధోని సేన 'ఆరంభం' అదుర్స్
మిర్పూర్:ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న టీమిండియా.. ఆపై బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆకట్టుకుని 45 పరుగుల విజయాన్ని అందుకుంది.టీమిండియా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20. 0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.బంగ్లా ఆటగాళ్లలో షబ్బీర్ రెహ్మాన్(44) మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రాకు మూడు వికెట్లు లభించగా, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అశ్విన్‌లకు తలో వికెట్ దక్కింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు నమోదు చేసింది. 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్ శర్మ ఆదుకున్నాడు. వికెట్లు పడుతున్నా తనదైన శైలికి ఏమాత్రం తగ్గని రోహిత్ (83; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. తన వ్యక్తిగత స్కోరు 21 పరుగుల వద్ద షకిబ్ క్యాచ్ ను వదిలివేయడంతో దాన్ని రోహిత్ సద్వినియోగం చేసుకుని బంగ్లాకు చుక్కులు చూపించాడు. రోహిత్ చివరి 62 పరుగులను సాధించే క్రమంలో 27 బంతులనే మాత్రమే ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ రెండొందలకు పైగా స్టైక్ రేట్ ను సాధించడం విశేషం. అతనికి జతగా హార్దిక్ పాండ్యా(31;16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) నిలకడను ప్రదర్శించాడు. ఈ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ధోని అండ్ గ్యాంగ్ తేరుకుంది. కాగా, స్కోరును పెంచే క్రమంలో వీరిద్దరూ చివరి ఓవర్ లో అవుట్ అయ్యారు. ఆ తరువాత కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక సిక్స్ సాయంతో ఎనిమిది పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను శనివారం పాకిస్తాన్ తో ఆడనుంది. -
పది ఓవర్లలో బంగ్లా స్కోరు 51/3
మిర్పూర్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. భారత్ విసిరిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ స్కోరు బోర్డు మెల్లగా ముందుకు వెళుతోంది. బంగ్లా ఓపెనర్ మహ్మద్ మిథున్(1) తొలి వికెట్ గా ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో అవుట్ కాగా, సౌమ్య సర్కార్(11)ను బూమ్రాహ్ బోల్తా కొట్టించాడు. ఆ తరువాత ఇమ్రూల్ కేయ్స్(14)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. -
రోహిత్ దూకుడు
మిర్పూర్:గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తనదైన దూకుడును ప్రదర్శించాడు. ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో రోహిత్ (83; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియా ఆదిలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రోహిత్ తొలుత కుదురుగా ఆడినా... ఆ తరువాత తన మార్కు ఆట తీరును చూపెట్టాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకిబ్ క్యాచ్ వదిలివేయడంతో బతికిపోయిన రోహిత్.. ఆపై 62 పరుగులను చేసే క్రమంలో 27 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ రెండొందలకు పైగా స్టైక్ రేట్ ను సాధించడం విశేషం. అతనికి జతగా హార్దిక్ పాండ్యా(31;16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) నిలకడను ప్రదర్శించాడు. ఈ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ధోని అండ్ గ్యాంగ్ తేరుకుంది. దీంతో టీమిండియా 167 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి బంగ్లాదేశ్ ముందు ఉంచకల్గింది. కాగా, స్కోరును పెంచే క్రమంలో వీరిద్దరూ చివరి ఓవర్ లో అవుట్ అయ్యారు. 19.2 బంతికి రోహిత్ అవుట్ కాగా, 19.4 బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కెప్టెన్ ధోని(8 నాటౌట్; 1 సిక్స్) ఆడిన తొలి బంతికి రెండు పరుగులు తీయగా, ఆఖరి బంతిని సిక్స్ గా మలచడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు నమోదు చేసింది.టీమిండియా మిగతా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(2), విరాట్ కోహ్లి(8), సురేష్ రైనా(13), యువరాజ్ సింగ్(15)లు నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో ఆల్ అమీన్ మూడు వికెట్లు సాధించగా, మోర్తజా, మహ్మదుల్లా, షకిబుల్ హసన్ లు తలో వికెట్ తీశారు.