
ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా ఇక్కడ భారత్తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
పుణె: మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా ఇక్కడ భారత్తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంకేయులు తొలుత భారత్ ను బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆహ్వానించారు. భారత్ బ్యాటింగ్ ను శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఆరంభించారు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అదే జోరును శ్రీలంకపై కూడా ప్రదర్శించాలని భావిస్తోంది. అటు టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండగా, శ్రీలంకలో మలింగా, మాథ్యూస్ వంటి సీనియర్ ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరం కావడంతో బలహీనంగా ఉంది. మరోవైపు దిల్షాన్ కూడా తొలి టీ 20కి అందుబాటులో లేకపోవడంతో టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. కాగా,ఈ సిరీస్ లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి విశ్రాంతి నిచ్చిన సంగతి తెలిసిందే.
భారత తుదిజట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ,అజింక్యా రహానే,సురేష్ రైనా,యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా,రవీంద్ర జడేజా, అశ్విన్, బూమ్రా, ఆశిష్ నెహ్రా