హాంబన్‌టోటా: శ్రీలంకతో జరుగుతున్న రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు డేవిడ్స్ (7), కాక్ (19) పరుగులకే పెవిలియన్ కు చేరగా, అనంతరం ప్లెస్సీ(12) పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో సఫారీలు కష్టాలు కొనితెచ్చుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో డుమినీ(30), మిల్లర్(36) స్కోరు బోర్డును చక్కదిద్దే యత్నం చేశారు. దీంతో సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల్లు కోల్పోయి 145 పరుగులు చేశారు.
లంక బౌలర్లలో సేననాయకే, కులశేఖరలకు తలో రెండు వికెట్లు లభించగా, మలింగాలకు ఒక వికెట్టు దక్కింది. ఇప్పటికే తొలి ట్వంటీ -20 గెలిచి మంచి ఊపు మీద ఉన్న సఫారీలు ఈ మ్యాచ్‌ను కూడా గెలిస్తే సిరీస్‌ను చేజిక్కించుకుంటారు. ఇరుజట్ల మధ్య మూడో ట్వంటీ 20 మ్యాచ్ మంగళవారం జరగనుంది.