
పాకిస్తాన్ విజయలక్ష్యం 130
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో యూఏఈ 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆదిలో తడబడినా తరువాత పుంజుకుంది. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో షైమాన్ అన్వర్(46;42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ముహ్మాద్ ఉస్మాన్(21),అమ్ జాద్ జావెద్ (27 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో యూఏఈ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆమిర్, ఇర్ఫాన్లు తలో రెండు వికెట్లు సాధించగా, ఆఫ్రిది, సమీలకు చెరో వికెట్ దక్కింది.