
పవన్ నేగీ అరంగేట్రం
మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా గురువారం ఇక్కడ యూఏఈతో తలపడుతున్న భారత క్రికెట్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ద్వారా పవన్ నేగీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. మరోవైపు చాలాకాలం నుంచి జట్టుతో పాటే ఉన్న హర్భజన్ సింగ్ తుది జట్టులోకి రాగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ కు చోటు కల్పించారు. వీరి రాకతో గత మ్యాచ్ ల్లో ఆడిన రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించకతప్పలేదు.
వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా, మూడు మ్యాచ్‌లు ఓడిన యూఏఈ నిష్ర్కమించింది. దాంతో టోర్నీపరంగా ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కాగా, భారత్, యూఏఈ మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం. టాస్ గెలిచిన యూఏఈ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.