మిర్పూర్: ఆసియాకప్లో భారత్తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో యూఏఈ పది ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 32 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(17), మొహ్మద్ ఉస్మాన్(6)లు క్రీజ్లో ఉన్నారు.
అంతకుముందు స్వప్నిల్ పాటిల్(1), మహ్మద్ షహజాద్(0), రోహన్ ముస్తఫా(11)లు పెవిలియన్ కు చేరారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.