
5 ఓవర్లు..14 పరుగులు.. 2 వికెట్లు
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా ఇక్కడ గురువారం టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు ట్వంటీ 20 మ్యాచ్లో యూఏఈ ఐదు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. యూఏఈ ఆటగాళ్లలో స్వప్నిల్ పాటిల్ (1), మహ్మద్ షహజాద్(0)లు పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ..భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. యూఏఈ కోల్పోయిన తొలి రెండు వికెట్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది.
భారత క్రికెట్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ద్వారా పవన్ నేగీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. మరోవైపు చాలాకాలం నుంచి జట్టుతో పాటే ఉన్న హర్భజన్ సింగ్ తుది జట్టులోకి రాగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ కు చోటు కల్పించారు. వీరి రాకతో గత మ్యాచ్ ల్లో ఆడిన రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు.