మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో ఇక్కడ ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న తుదిపోరులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ను అనుకున్న సమయానికి నిర్వహించడం సాధ్యపడలేదు. కాగా, రాత్రి గం.8.30ని.లకు అంపైర్లు పిచ్ను, అవుట్ ఫీల్డ్ ను పరిశీలించిన అనంతరం మ్యాచ్ జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మ్యాచ్ ను 15.0 ఓవర్లకు కుదించారు.
ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఓటమి ఎరుగకుండా ఫైనల్ కు చేరిన ధోని సేన ట్రోఫీతో స్వదేశాని పయనం కావాలని భావిస్తుండగా, మరోవైపు రోవైపు యువకులతో నిండిన బంగ్లాదేశ్ సమష్టిగా పోరాడి కప్ ను సాధించాలనే యోచనతో ఉంది. ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.
బంగ్లాతో తుదిపోరు:ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
Published Sun, Mar 6 2016 8:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM
Advertisement
Advertisement