మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
పుణె: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, అజింక్యా రహానే(4), శిఖర్ ధావన్(9)లు పెవిలియన్ కు చేరారు.
తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. ఐదో ఓవర్ చివరి బంతికి మూడో వికెట్ ను నష్టపోయింది.ఈ మూడు వికెట్లు శ్రీలంక బౌలర్ కాశున్ రజితా ఖాతాలోనే పడ్డాయి. టాస్ గెలిచిన లంకేయులు తొలుత టీమిండియాను బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆహ్వానించారు.