
టీమిండియాలో కొత్త ముఖాలు!
హరారే: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న ధోని సేన.. టీ 20 సిరీస్ ద్వారా మరికొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. జింబాబ్వేతో వన్డే సిరీస్ ద్వారా కేఎల్ రాహుల్ అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. మొదటి అంతర్జాతీయ టీ 20 ఆడబోతున్నాడు.
ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని మన్‌దీప్ సింగ్, ఉనాద్కట్లకు తాజా టీ 20 తుది జట్టులో అవకాశం కల్పించారు. దీంతో పాటు బౌలర్ రిషి ధవన్ కూడా తొలి టీ 20కి సిద్ధమయ్యాడు. మరోవైపు ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటుకున్న యజ్వేంద్ర చాహల్ కూడా పొట్టి ఫార్మాట్లో చోటు కల్పించారు. దీంతో ఐదుగురు భారత యువ ఆటగాళ్లు ఒకేసారి టీ 20లో అరంగేట్రం చేయబోతున్నారు.
భారత తుది జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, రిషి ధవన్, బూమ్రా, ఉనాద్కట్, చాహల్
జింబాబ్వే తుది జట్టు: క్రీమర్(కెప్టెన్), చిబాబా, మసకద్జా, సికిందర్ రాజా, వాలర్, చిగుంబరా, ముతుంబామి, ముతోంబోడ్జి, మాద్జివా, ముజారాబాని, తిరిపానో