నాల్గోస్థానానికి పడిపోయారు..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రదర్శనతో ఆరు పాయింట్లు కోల్పోయిన భారత్ 118 పాయింట్లతో ఉంది. న్యూజిలాండ్ (125 పాయింట్లు), ఇంగ్లండ్ (121), పాకిస్తాన్ (121) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, పాక్‌ల పాయింట్లు సమమైనా కొద్దితేడాతో ఇంగ్లండ్ ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఐదు నుంచి పదిస్థానాల్లో కొనసాగుతున్నాయి. కటాఫ్ తేదీ నాటికి ర్యాంకింగ్స్‌లోని తొలి తొమ్మిది జట్లు ఆస్ట్రేలియాలో జరిగే 2020 టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్యదేశం హోదాలో ఆసీస్ నేరుగా ఆడనుంది. మిగతా ఆరు స్థానాల కోసం ర్యాంకింగ్స్‌లోని మిగతా జట్లు పోటీపడనున్నాయి.