మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి ట్వంటీ 20 లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. కాగా, ఇటీవల కాలంలో శ్రీలంక-పాకిస్తాన్లు పేలవమైన ఫామ్ను కొనసాగిస్తుండటంతో కనీసం విజయం సాధించి కాస్త పరువు దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఆసియాకప్లో రెండు జట్లు పసికూన యూఏఈపై మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే.