
ధోని సేన గాడిలో పడేనా?
హరారే: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ 20లో గెలిచిన జింబాబ్వే అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తుండగా, ధోని సేన మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. ఈ మ్యాచ్లో ధోని గ్యాంగ్ గెలిచిన పక్షంలో సిరీస్పై ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధిస్తే సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది.
గతంలో ఒక్కసారి కూడా ఏ జట్టుపైనా టి20 సిరీస్ నెగ్గని జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. భారత్‌పై తొలిసారి సిరీస్ నెగ్గాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ధోని సేన గాడిలో పడితేనా సిరీస్ను కాపాడుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే రెండో టీ 20 ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో ఆడిన ఉనాద్కట్కు రెండో టీ 20 తుది జట్టులో అవకాశం కల్పించలేదు. అతని స్థానంలో బరిందర్ శ్రవణ్ జట్టులోకి వచ్చాడు.
భారత తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, కులకర్ణి, బూమ్రా, బరిందర్ శ్రవణ్, చాహల్
జింబాబ్వే తుది జట్టు:క్రీమర్(కెప్టెన్), చిబాబా,మసకద్జా, సికిందర్ రాజా,వాలర్,చిగుంబరా, మూర్,ముతోంబోడ్జి, మద్జివా, ముజారంబని, తిరిపానో