పాకిస్తాన్ను కూల్చేశారు!
మిర్పూర్:భారత్-పాకిస్తాన్ల క్రికెట్ మ్యాచ్ అంటే సర్వత్రా ఆసక్తికరం. ఆటగాళ్లు కూడా అంచనాల మించి రాణించాలనుకుంటారు. దీంతో సుదీర్ఘ విరామం అనంతరం తలపడుతున్నఇరు జట్లు పోరు ఉత్కంఠ జరిగే అవకాశం ఉందని తొలుత అంచనా వేశారు. అయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఏమాత్రం భారత్ బౌలింగ్ ను ప్రతిఘటించలేకపోయింది. కనీసం మూడంకెల మార్కును చేరకుండానే చాపచుట్టేసింది.
ఆసియాకప్లో భాగంగా జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పేకమేడలా కుప్పకూలింది. భారత్ పదునైన బౌలింగ్కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో పాక్ ఇంకా 15 బంతులుండగానే మూటగట్టేసింది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ముందు పాకిస్తాన్ బ్యాటింగ్లో కట్టడి చేయాలని భావించిన ధోని అండ్ గ్యాంగ్ అందుకు తగ్గట్టునే రాణించింది. కేవలం 17.3 ఓవర్లలో 83 పరుగులకే పాక్ ను కూల్చేసింది.
పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ అహ్మద్(25) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, రవీంద్ర జడేజాకు రెండు, నెహ్రా, బూమ్రా, యువరాజ్ సింగ్లకు తలో వికెట్ లభించింది.