
షేన్ వార్న్ టీ 20 జట్టులో కోహ్లి!
మెల్బోర్న్:ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తన కలల వరల్డ్ టీ 20 క్రికెట్ జట్టును తాజాగా ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి స్థానం కల్పించాడు. ఓపెనర్లగా క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్లకు ఎంపిక చేయగా, ఫస్ట్ డౌన్కు విరాట్ కోహ్లిని, సెకెండ్ డౌన్కు ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేశాడు.
ఆ తరువాత స్థానాల్లో వరుసగా షేన్ వాట్సన్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రేవో, జాస్ బట్లర్, మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, ఫిజ్లను ఎంపిక చేశాడు. అయితే వార్న్ తన కలల జట్టులో ఆస్ట్రేలియా టీ 20 స్పెషలిస్టు అరోన్ ఫించ్ తో పాటు, డేవిడ్ వార్నర్, మార్టిన్ గప్టిల్ ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. గత కొంతకాలం నుంచి వార్న్ కలల జట్టును ఎంపిక చేస్తూ క్రికెట్ పై ప్రేమను ఈ రకంగా చాటుకోవడం అలవాటు. గతేడాది డిసెంబర్ లో వార్న్ తన కలల టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.