
టాస్ గెలిచిన భారత్
మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అటు బ్యాటింగ్లో బలంగా ఉన్న భారత్.. తొలుత బౌలింగ్ తీసుకుని దాయాది పాకిస్తాన్ ను కట్టడి చేయాలని భావిస్తోంది. కాగా, పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి రావడంతో స్కోరు బోర్డుపై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాలని యోచిస్తోంది.
ఇప్పటికే రెండు వరుస సిరీస్లు గెలవడంతో పాటు, ఆసియాకప్లో బంగ్లాదేశ్పై ఘనవిజయం సాధించిన ధోని సేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, మరోవైపు పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల చేతిలో వరుసగా రెండు టి20 సిరీస్‌లు ఓడి తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సిద్ధమైంది. భారత్, పాక్‌ల మధ్య ఇప్పటివరకూ ఆరు టి20 మ్యాచ్‌లు జరిగితే భారత్ ఐదు గెలవగా, ఒకదాంట్లో మాత్రమే పాక్ విజయం సాధించింది.