పాకిస్తాన్ పేకమేడలా..
మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా భారత్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. పాకిస్తాన్ 52 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. భారత్ పదునైన బౌలింగ్కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ కు కలిసిరావడంతో పాక్ పేకమేడలా కూలింది.
పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ హఫీజ్(4), షలీల్ ఖాన్(7), ఖుర్రామ్ మంజూర్(10),షోయబ్ మాలిక్(4), ఉమర్ అక్మల్(3), ఆఫ్రిది(2), రియాజ్(4)లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లను సమర్పించుకోవడంతో భారత్ పట్టుబిగించింది. భారత్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా, బూమ్రా, పాండ్యా, యువరాజ్ సింగ్ , రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది. మరో రెండు వికెట్లను రనౌట్ రూపంలో వచ్చాయి. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.